చరిత్రలో ఈ రోజు
డిసెంబరు 28
- 1694: బ్రిటీష్ రాణి మేరీ-2 మరణం
- 1836: అడిలైడ్ (ఆస్ట్రేలియా) నగరం స్థాపించబడింది
- 1846: అమెరికాలో 29వ రాష్ట్రంగా లోవా అవతరించింది
(ఉడ్రోవిల్సన్ వ్యాసం)
- 1859: మొదటి లా కమిషన్ ఛైర్మన్, భారత్‌లో ఆంగ్ల విద్యకు బీజాలు వేసిన మెకాలే మరణం
- 1885: భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ స్థాపించబడింది
- 1885: భారత జాతీయ కాంగ్రెస్ తొలి సమావేశాలు బొంబాయి (ఇప్పటి ముంబాయి)లో నిర్వహించబడ్డాయి
- 1896: కలకత్తా (ఇప్పటి కోల్‌కత) సమావేశంలో వందేమాతరం గీతం ఆలపించబడింది
- 1908: దక్షిణ ఇటలీలో భారీ భూకంపం సంభవించి 80వేలమంది మరణించారు
(ధీరూభాయి అంబానీ వ్యాసం)
- 1932: తెలంగాణకు చెందిన ప్రముఖ మిమిక్రీ కళాకారుడు నేరెళ్ళ వేణుమాధవ్ జననం
- 1937: వ్యాపారవేత్త రతన్ టాటా జననం
- 1940: రాజకీయ నాయకుడు, కేంద్రమంత్రిగా పనిచేసిన ఏ.కె.ఆంటోని జననం
- 1940: తెలుగు సినిమా నటుడు వంకాయల సత్యనారాయణ జననం
- 1944: అమెరికాకు చెందిన జీవరసాయన శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత కారి ముల్లిస్ జననం
- 1945: నేపాల్ రాజుగా పనిచేసిన బీరేంద్ర జననం
- 1952: రాజకీయ నాయకుడు, కేంద్రమంత్రిగా పనిచేసిన అరుణ్ జైట్లీ జననం (భారతదేశ ఆర్థికమంత్రుల జాబితా)
- 1955: చైనాకు చెందిన రచయిత, నోబెల్ బహుమతి గ్రహీత లియు జియాబో జననం
- 1977: ప్రముఖ రచయిత, జ్ఞాన్‌పీఠ్ పురస్కార గ్రహీత సుమిత్రానందన్ పంత్ జననం
- 2007: హైదరాబాదుకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు పి.జనార్థన్ రెడ్డి మరణం (హైదరాబాదు రాజకీయ నాయకుల జాబితా)
- 2010: కోల్‌కత మెట్రో భారతీయ రైల్వేలో 17వ జోన్‌గా అవతరించింది
ఇవి కూడా చూడండి:
= = = = =
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి