13, డిసెంబర్ 2020, ఆదివారం

దేవరకొండ కోట (Devarakonda Fort)

జిల్లా
నల్గొండ జిల్లా
నిర్మాణ కాలం
క్రీ.శ.13వ శతాబ్ది
ప్రముఖ రాజవంశం
రేచర్ల పద్మనాయకులు
ఎత్తు
500 అడుగులు
తెలంగాణలోని ప్రముఖ గిరిదుర్గాలలో ఒకటైన దేవరకొండ కోట నల్గొండ జిల్లా దేవరకొండలో ఉంది. క్రీ.శ.13వ శతాబ్దిలో నిర్మించిన ఈ కోట 500 అడుగుల ఎత్తున 7 కొండల నడుమ ఉప్పువాగు, స్వర్ణముఖి వాగుల మధ్యన నిర్మితమైంది. కోటకు 9 ద్వారాలు, 360 బురుజున్నాయి. కోటలోపల పలు బావులు, ధాన్యాగారాలు, ఆయుధాగారాలు, సైనిక నివాసాలు, రాజమందిరం, అంతఃపురం, సభావేదికలు ఉన్నాయి. ప్రధానద్వారంపై పూర్ణకుంభం ముద్ర ఉంది. ప్రముఖ రచయిత ముకురాల రామారెడ్డి "దేవరకొండ దుర్గం" ఖండకావ్యం రచించారు. వరకొండ కోట కేంద్రంగా పాలించినవారిలో ముఖ్యులు పద్మనాయకులు

చరిత్ర:
కాకతీయుల సామంతులుగా ఉండి స్వతంత్రులైన పద్మానాయకులచే దేవరకొండ దుర్గం నిర్మించబడినట్లుగా చరిత్రకారులు నిర్థారించారు. మాదానాయుడు కాలంలో దేవరకొండ దుర్గం నిర్మాణం జరిగినట్లు ఆధారాలు లభించాయి. క్రీ.శ.13 -15 శతాబ్దాల మధ్య పద్మనాయకులు దేవరకొండ కేంద్రంగా సుమారు 150 సంవత్సరాలు పాలించారు. తర్వాతి కాలంలో ఈ కోట బహమనీ, కుతుబ్‌షాహీల వశమై ప్రత్యేకతను కోల్పోయింది. తెలంగాణ మొత్తంతో పాటు ఇది కూడా కొంతకాలం మొఘలుల అధీనంలో ఉండి తర్వాత నిజాం రాజ్యంలో భాగమై 1948లో భారత యూనియన్‌లో కలిసింది. ప్రస్తుతం ఈ కొట పురావస్తుశాఖ పరిధిలో ఉంది.

ఇవి కూడా చూడండి:


హోం
విభాగాలు: నల్గొండ జిల్లా, తెలంగాణ కోటలు, దేవరకొండ మండలం, రేచర్ల పద్మనాయకులు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి