24, జులై 2015, శుక్రవారం

దేవరకొండ మండలం (Devarkonda Mandal)

జిల్లానల్గొండ జిల్లా
వైశాల్యం
రెవెన్యూ డివిజన్మిర్యాలగూడ,
జనాభా86584 (2001),
99165 (2011),
అసెంబ్లీ నియో.దేవరకొండ అ/ని.
లోకసభ నియో.నల్గొండ లో/ని.
దేవరకొండ నల్గొండ జిల్లాకు చెందిన మండలము. 2012లో నగరపంచాయతీగా మారిన దేవరకొండ చారిత్రాత్మక పట్టణం. నిజాం విమోచనోద్యమ పోరాటయోధుడు సి.వి.చారి, తెలంగాణ రాష్ట్ర తొలి మంత్రిమండలిలో స్థానం పొందిన నాయిని నరసింహారెడ్డి, ఎమ్మెల్యేగా ఎన్నికైన రామావత్ రవీంద్రకుమార్ ఈ మండలమునకు చెందినవారు. మండలంలో 29 రెవెన్యూ గ్రామాలు, 21 గ్రామపంచాయతీలు, ఒక పురపాలక సంఘం, 20 ఎంపీటీసి స్థానాలు కలవు. ఈ మండలము మిర్యాలగూడ రెవెన్యూ డివిజన్, దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గం, నల్గొండ లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది

భౌగోళికం, సరిహద్దులు:
భౌగోళికంగా దేవరకొండ మండలం నల్గొండ జిల్లాలో నైరుతి భాగంలో ఉంది. ఈ మండలానికి ఉత్తరాన నాంపల్లి మండలం, చింతపల్లి మండలం, ఈశాన్యాన గుర్రంపోడ్ మండలం, తూర్పున పెద్ద అడిశర్లపల్లి మండలం, దక్షిణాన చందంపేట్ మండలం, నైరుతిన గుండ్లపల్లి మండలం, పశ్చిమాన కొంతవరకు మహబూబ్‌నగర్ జిల్లా సరిహద్దులో ఉన్నాయి.

జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 86584, 2011 నాటికి జనాభా 12581 పెరిగి 99165 కు పెరిగింది. 2001 మరియు 2011 ప్రకారము జిల్లాలో అత్యధిక జనాభా కల మండలాలలో ఆరవస్థానంలో ఉంది.
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 99165. ఇందులో పురుషులు 50919, మహిళలు 48246. పట్టణ జనాభా 39341, గ్రామీణ జనాభా 59824. 2011 జనాభా ప్రకారం ఈ మండలం జిల్లాలో 6వ స్థానంలో ఉంది.

దేవరకొండ స్థానము
రాజకీయాలు:
ఈ మండలము దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గం, నల్గొండ లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. తెలంగాణ రాష్ట్ర తొలి మంత్రిమండలిలో స్థానం పొందిన నాయిని నరసింహారెడ్డి, ఎమ్మెల్యేగా ఎన్నికైన రామావత్ రవీంద్రకుమార్ ఈ మండలమునకు చెందినవారు.

రవాణా సౌకర్యాలు:
దేవరకొండ నుంచి నల్గొండ, కల్వకుర్తి, హైదరాబాదులకు మంచి రవాణా సౌకర్యాలున్నాయి. ఈ మండలానికి రైలుసదుపాయం లేదు.


విభాగాలు: నల్గొండ జిల్లా మండలాలు, దేవరకొండ మండలం, నల్గొండ లోకసభ నియోజకవర్గం,


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక