బీహార్ భారతదేశపు 28 రాష్ట్రాలలో ఒకటి. ఇది దేశంలో వైశాల్యంలో 12వ స్థానంలో మరియు జనాభాలో 3వ స్థానంలో ఉంది. ఈ రాష్ట్రానికి ఉత్తరాన నేపాల్ ఉండగా పశ్చిమాన ఉత్తరప్రదేశ్, తూర్పున పశ్చిమబెంగాల్ ఉత్తర భాగం, దక్షిణాన ఝార్ఖండ్ రాష్ట్రాలు కలవు. గంగానది ఈ రాష్ట్రాన్ని ఉత్తర, దక్షిణాలుగా విభజిస్తుంది. 2000లో బీహార్ నుంచి విడిపోయి ఝార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. ప్రాచీన భారతదేశ చరిత్రలో శక్తివంతమైన మగధ రాజ్యం విలసిలిన ప్రాంతమే నేటి బీజార్. బుద్ధుడు విహరించిన ప్రదేశం కావడంతో బీహార్ పేరువచ్చినట్లు చరిత్రకారుల భావన. బీహార్ రాజధానిగా ఉన్న పాట్నా చరిత్రలో పాటలీపుత్రగా పిలువబడి ప్రఖ్యాతిచెందింది. ప్రాచీన విశ్వవిద్యాలయాలు నలంద, విక్రమశిలలు ఈ రాష్ట్రంలో ఉనాయి. ఆధునిక కాలంలో మాత్రం ఈ రాష్ట్రం ఆర్థికంగా వెనకబడి ఉంది. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు జగ్జీవన్ రాం, ప్రముఖ శాస్త్రవేత్త ఆర్యభట్ట, రాష్ట్రపతిగా పనిచేసిన రాజేంద్రప్రసాద్ బీహార్ రాష్ట్రానికి చెందినవారు. రాష్ట్రంలో 38 జిల్లాలు, 40 లోకసభ నియోజకవర్గాలు, 243 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.
చరిత్ర:
భౌగోళికం: బీహార్ రాష్ట్ర వైశాల్యము 98,940 చదరపు కిలోమీతర్లు. ఇది దేశంలో 13వ పెద్ద రాష్ట్రము. రాష్ట్రం మధ్యగుండా తూర్పు పడమరలుగా గంగానది ప్రవహిస్తుండగా దీని ఉపనదులు ఉత్తరం మరియు దక్షిణం గుండా ప్రవహిస్తున్నాయి. బీహార్‌లో ప్రవహించే గంగానది ఉపనదులలో గండక్, కోస ప్రధానమైనవి. ఉత్తరాన నేపాల్‌లో అత్యున్నతమైన హిమాలయాలు ఉండుటచే వాతారవణం చల్లగా ఉంటుంది. కోసినది తరుచుగా వరదలతో ముంచెత్తుతుంది. జనాభా: 2011 లెక్కల ప్రకారం బీహార్ జనాభా 10,38,04,637. ఇది దేశంలో మూడవ అత్యధిక జనాభా కల రాష్ట్రం. 2001 నాటి జనాభా 8,29,98,509తో పోల్చితే 25% వృద్ధిచెందింది. పాట్నా, గయ, భాగల్‌పూర్, ముజప్ఫర్‌పూర్, పూర్ణియా ఈ రాష్ట్రంలోని పెద్ద నగరాలు. రాజకీయాలు: స్వాతంత్ర్యానంతరం 1977 వరకు మధ్యలో కొంతకాలం మినహా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని పాలించగా 1977-80లో జనతాపార్టీ అధికారంలో ఉంది. ఆ తత్వాత మరో పదేళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారలో ఉండగా 1990లో జగన్నాథ్ మిశ్రా తర్వాత కాంగ్రెస్ పార్టీకి అధికారం లభించలేదు. జనతాదళ్, రాష్ట్రీయ జనతాదళ్, జనతాదళ్ (యు)లు అధికారంలో కొనసాగాయి. 1970 దశకంలో దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన జయప్రకాశ్ నారాయణ బీహార్‌కు చెందినవాడు. ఇవి కూడా చూడండి:
= = = = =
|
16, జనవరి 2015, శుక్రవారం
బీహార్ (Bihar)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి