14, మే 2015, గురువారం

బంగ్లాదేశ్ (Bangladesh)

ఖండంఆసియా
రాజధానిఢాకా
వైశాల్యం1.44 లక్షల చకిమీ
జనాభాసుమారు 15 కోట్లు
దక్షిణాసియాలో భారతదేశంచే దాదాపు మూడువైపులా ఆవరించబడిన బంగ్లాదేశ్ 1947కు ముందు బ్రిటీష్ ఇండియాలో, ఆ తర్వాత పాకిస్తాన్‌లో భాగంగా ఉండి 1971లో స్వాతంత్ర్యం పొందింది. సారవంతమైన గంగా-బ్రహ్మపుత్ర మైదాన ప్రాంతంలో ఉన్న ఈ దేశము 15 కోట్లకు పైగా జనాభానూ, 1.44 లక్షల చకిమీ వైశాల్యం కలిగియుంది. చారిత్రకంగా ఇది బెంగాల్ భాషా ప్రాంతంలోని భాగము. ఈ దేశ అధికార భాష కూడా బెంగాలీ. బంగ్లాదేశ్ కరెన్సీ టక. ఈ దేశ రాజధాని ఢాకా. దేశంలో 7 డివిజన్లు, 64 జిల్లాలు కలవు. దేశంలోని ప్రధాన నగరాలు ఢాకా, చిట్టగాంగ్, ఖుల్నా, నారాయణ్ గంజ్, సిల్హెట్.

భౌగోళికం, సరిహద్దులు:
దక్షిణాసియాలో భాగంగా ఉన్న బంగ్లాదేశ్ గంగా-బ్రహ్మపుత్ర డెల్టా ప్రాంతంలో భారతదేశానికి చెందిన పశ్చిమబెంగాల్‌కు తూర్పున 147,570 చకిమీ వైశాల్యంతో ఉంది. దాదాపు మూడు వైపులా భారతదేశం సరిహద్దుగా ఉండగా, దక్షిణాన బంగాళాఖాతం, ఆగ్నేయాన బర్మాలు సరిహద్దులుగా ఉన్నాయి.

చరిత్ర:
భారత ఉపఖండంలో ఉన్న బంగ్లాదేశ్ భారత్‌తో పాటు ఎంతో చరిత్రను కలిగియుంది. మౌర్యులు, గుప్తుల కాలంలో కూడా ఈ ప్రాంతం ఆ సామ్రాజ్యాలలో భాగంగా కొనసాగింది. 7వ శతాబ్దిలో గౌడ రాజ్యం, 8వ శతాబ్దిలో పాల రాజ్యం స్థాపించబడ్డాయి. ఈ కాలంలో ఇక్కడ మహాయాన బౌద్ధమతం విలసిల్లింది. 7వ శతాబ్దిలో ప్రవేశించిన ఇస్లాం క్రమక్రమంగా ఈ ప్రాంతంలో విస్తరించింది. సూఫీజం కూడా ఇస్లాం మత వ్యాప్తికి దోహదపడింది. 13వ శతాబ్ది ప్రారంభంలో సేన రాజు లక్ష్మణసేనుడిని భక్తియార్ ఖిల్జీ ఓడించడంతో ఈ ప్రాంతంలో ఇస్లాం పాలనకు పునాదులు ఏర్పడ్డాయి. మొఘల్ కాలంలో ఈ ప్రాంతం భాగంగా ఉండేది. ఆ తర్వాత బ్రిటీష్ వారు పాలించారు. 1బ్రిటీష్ ఇండియా కాలంలో బెంగాల్ ప్రావిన్సులో భాగంగా ఉన్న ఈ ప్రాంతం 1947లో దేశ విభజన సమయంలో బెంగాల్ ప్రావిన్సు తూర్పు భాగంలో ముస్లిం జనాభా అధికంగా ఉండుటచే పాకిస్తాన్‌లో విలీనమైంది. 1971లో పాకిస్తాన్ నుంచి స్వాతంత్ర్యం పొంది ప్రత్యేక దేశంగా ఏర్పడింది.

జనాభా:
2011 ప్రకారం బంగ్లాదేశ్ జనాభా 14.23 కోట్లు కాగా ప్రస్తుత జనాభా 15 కొట్లకుపైగా ఉండి ప్రపంచంలోనే 8వ అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉంది. 1033/చకిమీ జనసాంద్రతతో ఇది ప్రపంచంలో అత్యధిక జనసాంద్రత కలిగిన దేశాలలో ఒకటిగా ఉంది. దేశంలోని ప్రధాన నగరాలు ఢాకా, చిట్టగాంగ్, ఖుల్నా, నారాయణ్ గంజ్, సిల్హెట్. దేశంలో 86% ప్రజలు ముస్లింలు, 12% హిందువులు, 1% బౌద్ధులున్నారు.

ఆర్థికం:
అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఒకటైన బంగ్లాదేశ్ స్థూల జాతీయోత్పత్తిలో 51% సేవల నుంచి పొందుతోంది. జనపనార ఉత్పత్తిలో ప్రపంచంలో రెండో స్థానంలోనూ, వరి ఉత్పత్తిలో 4వ స్థానంలో, చేపల ఉత్పతిలో 5వ స్థానంలో ఉంది. వస్త్రాల ఎగుమతి ద్వారా మంచి విదేశీమారక ద్రవ్యాన్ని అర్జిస్తోంది. 

క్రీడలు:
క్రికెట్ ఈ దేశ జనాదరణ క్రీడ. బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు టెస్ట్ హోదా పొందడమే కాకుండా 1999 నుంచి ప్రపంచకప్ టోర్నీలలో పాల్గొంటున్నది. 2011లో భారత్, శ్రీలంకలతో కలిసి ఐసిసి ప్రపంచకప్ టోర్నీని నిర్వహించింది. 2012లో కూడా భాగస్వామ్యంతో ఆసియా కప్ క్రికెట్ నిర్వహించింది. 2010 ఆసియా క్రీడలలో క్రికెట్‌లో స్వర్ణపతకం సాధించింది. కబడ్డి, ఫుట్‌బాల్ కూడా ఇక్కడ ప్రజాదరణ పొందిన క్రీడలు.

విభాగాలు: ప్రపంచ దేశాలు, ఆసియా దేశాలు, బంగ్లాదేశ్, 1971,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక