భారతదేశంలో పశ్చిమాన ఉన్న రాష్ట్రం గుజరాత్. పాకిస్తాన్ మరియు అరేబియా సముద్ర సరిహద్దును కలిగియున్న ఈ రాష్ట్రం శరవేగంగా పారిశ్రామిక అభివృద్ధిని సాధిస్తోంది. గాంధీనగర్ ఈ రాష్ట్ర రాజధాని నగరం. అహమ్మదాబాద్, వడోదర, సూరత్ ఈ రాష్ట్రంలోని ఇతర ప్రధాన నగరాలు. పూర్వం బొంబాయ్ రాష్ట్రంలో భాగంగా ఉన్న ఈ రాష్ట్రం 1960 మే 1న గుజరాతీ భాష మాట్లాడే ప్రాంతాలను వేరుచేసి గుజరాత్ రాష్ట్రం ఏర్పాటు చేశారు. భారత జాతిపిత, మహాత్మా గాంధీ, బారతదేశ ఉక్కుమనిషి సర్దార్ వల్లభభాయి పటేల్, ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్రమోడి, భారత రోదసీ పితామహుడు విక్రమ్ సారాభాయ్ గుజరాత్‌కు చెందినవారు. సోమనాథ దేవాలయం, ద్వారక క్షేత్రాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. రాష్ట్ర వైశాల్యం 1,96,204 చదరపు కిలోమీటర్లు. 2011 లెక్కల ప్రకారం జనాభా 6,04,39,692. రాష్ట్రంలో 33 జిల్లాలు, 26 లోకసభ స్థానాలు, 182 శాసనసభ స్థానాలున్నాయి.
భౌగోళికం, సరిహద్దులు: గుజరాత్‌కు ఉత్తరాన రాజస్థాన్, దక్షిణాన మహారాష్ట్ర, తూర్పున మధ్యప్రదేశ్ రాష్ట్రాలు, వాయువ్యదిశలో పాకిస్తాన్, నైరుతిన అరేబియా సముద్రం సరిహద్దులుగా ఉన్నాయి. గుజరాత్ రాష్ట్రానికి 1600 కి.మీ. పొడవైన సముద్ర తీరరేఖ ఉంది. దేశంలోనే రాష్ట్రాలకంటే ఇది ఎక్కువ. కచ్ సింధుశాఖ, కాంబే సింధుశాఖ ఈ తీరంలో భాగాలు. అహ్మదాబాద్, వడోదర (బరోడా), సూరత్, రాజ్‌కోట్, జామ్‌నగర్, భారుచ్, వల్సాడ్, భుజ్, ద్వారక ఈ రాష్ట్రంలోని ప్రధాన నగరాలు.
భారతదేశంలో వర్థిల్లిన హరప్పా-మొహంజోదారో నాగరికత యొక్క అనేక శిథిలాలు, పట్టణాలు ఈ రాష్ట్రంలో వెలుగుచూశాయి. సముద్రతీరం మరియు అనేక నదులు కలిగియున్నందున మౌర్య, గుప్త సామ్రాజ్యం కాలంనుండి ఇది వర్తక కేంద్రముగా విలసిల్లింది. భారుచ్ నౌకావర్తకకేంద్రంగా చరిత్రలో స్థానం పొందింది. గుప్తుల సామ్రాజ్యం పతనమైన తరువాత మైత్రిక రాజులు గుజరాత్‌ను 6నుండి 8వ శతాబ్దము వరకు పాలించారు. 770లో సింద్ ప్రాంతంనుండి అరబ్బులు దండెత్తారు. ప్రతీహార రాజులు 8వ శతాబ్దం తరువాత కొంతకాలం పాలించారు. 960 నుండి 1243 వరకు సోలంకి వంశానికి చెందిన రాజపుత్రులు ఆ తర్వాత వాఘేలా వంశస్థులు పాలించారు. 13వ శతాబ్దిలో ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ గుజరాత్‌ను తన అధికారంలోకి తెచ్చుకొన్నాడు. 1576లో అక్బరు గుజరాత్‌ను జయించి మొఘల్ సామ్రాజ్యంలో కలుపుకున్నాడు. 18వ శతాబ్దంలో మరాఠాలు ఈ ప్రాంతాన్ని జయించారు. ఆధునిక యుగంలో పోర్చుగీసు వర్తకులు డామన్, డయ్యు, దాద్రా, నాగర్ హవేలీ, మరికొన్ని స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ వారు దేశంలోనే తొలిసారిగా సూరత్‌లో ఒక ఫ్యాక్టరీ స్థాపించారు. రెండో ఆంగ్ల-మరాఠా యుద్ధం తరువాత గుజరాత్ ఆంగ్లేయుల అధీనంలోకి వచ్చింది. 1947లో దేశ స్వాతంత్ర్యానంతరం ప్రస్తుత గుజరాత్ ప్రాంతం ముంబాయి రాష్ట్రంలో ఉండగా 1 మే 1960న భాషాపరంగా గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాలుగా విభజించారు. ప్రారంభంలో గుజరాత్ రాజధాని అహమ్మదాబాదు. 1970లో గాంధీనగర్‌కు మార్చబడింది. 26 జనవరి 2001న గుజరాత్‌లోని భుజ్ ప్రాంతంలో దారుణమైన భూకంపం సంభవించి 20,000 మంది ప్రాణాలు కోల్పోయారు.
2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 6,03,83,628. జనసాంద్రత 308/చకిమీ. స్త్రీ-పురుష నిష్పత్తి 918:1000. 2001 నాటి 5,06,71,000 జనాభాతో పోలిస్తే 22.7% వృద్ధి సాధించింది. ఇవి కూడా చూడండి:
= = = = =
|
26, ఫిబ్రవరి 2015, గురువారం
గుజరాత్ (Gujarat)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి