వీణవంక కరీంనగర్ జిల్లాకు చెందిన మండలము. మండలంలో 14 ఎంపీటీసి స్థానాలు, 26 గ్రామపంచాయతీలు, 14 రెవెన్యూ గ్రామాలు కలవు. మండలానికి ఉత్తర సరిహద్దులో మానేరు నది ప్రవహిస్తోంది. రాష్ట్ర మాజీ మంత్రి, 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ముద్దుసాని దామోదర్ రెడ్డి ఈ మండలానికి చెందిన వారు.
భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి తూర్పున జమ్మికుంట మండలం, దక్షిణాన మరియు నైరుతిన శంకరపట్నం మండలం, పశ్చిమాన మానకొండూర్ మండలం, ఉత్తరాన పెద్దపల్లి జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. మండలం ఉత్తర సరిహద్దు గుండా మానేరునది ప్రవహిస్తుంది. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 49030. ఇందులో పురుషులు 24468, మహిళలు 24562. అక్షరాస్యుల సంఖ్య 28397. రాజకీయాలు: ఈ మండలము హుజురాబాదు అసెంబ్లీ నియోజకవర్గం, కరీంనగర్ లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. రాష్ట్రమంత్రిగా, 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ముద్దుసాని దామోదర్ రెడ్డి ఈ మండలానికి చెందిన వారు. 2019లో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన ముసిపట్ల రేణుక, జడ్పీటీసిగా తెరాసకు చెందిన మాడ వనమాల ఎన్నికయ్యారు.
వీణవంక మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Bethigal, Bonthupalli, Brahmanpalli, Challoor, Elbaka, Ghanmukula, Kanparthi, Kondapaka, Korkal(Jangampalli), Mamidalapalli, Pothireddipalli, Reddipalli, Valbapur, Veenavanka
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
హిమ్మత్‌నగర్ (Himmathnagar): హిమ్మర్‌నగర్ కరీంనగర్ జిల్లా వీణవంక మండలమునకు చెందిన గ్రామం. ఈ గ్రామం జిల్లా స్థాయి ఉత్తమ ఆదర్శ పంచాయతీగా ఎంపికైంది. విద్యార్థి నాయకుడు గెల్లు శ్రీనివాస్ ఈ గ్రామానికి చెందినవారు. 2021 హుజురాబాదు ఉప ఎన్నికలలో తెరాస తరఫున పోటీలో ఉన్నారు.
మామిడాలపల్లి (Mamidalapally):
మామిడాలపల్లి కరీంనగర్ జిల్లా వీణవంక మండలమునకు చెందిన గ్రామము. రాష్ట్ర మాజీ మంత్రి, 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ముద్దుసాని దామోదర్ రెడ్డి ఈ గ్రామానికి చెందిన వారు..
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Veenavanka Mandal in Telugu, Karimnagar Dist (district) Mandals in telugu, Karimnagar Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి