3, ఫిబ్రవరి 2014, సోమవారం

హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం (Huzurabad Assembly Constituency)

హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం కరీంనగర్ జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజవర్గంలో 4 మండలాలు కలవు. ఈ సెగ్మెంట్ కరీంనగర్ లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది.  ప్రస్తుతం ఈటెల రాజేందర్ ఈ నియోజకర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

నియోజకవర్గ పరిధిలోని మండలాలు:
2009 నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఈ నియోజకవర్గం పరిధిలో 4 మండలాలు కలవు.
 • వీణవంక,
 • జమ్మికుంట,
 • హుజురాబాద్,
 • కమలాపూర్,
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2004 ఈటెల రాజేందర్ తెరాస

2008* ఈటెల రాజేందర్ తెరాస

2009 ఈటెల రాజేందర్ తెరాస కృష్ణమోహన్‌ కాంగ్రెస్ పార్టీ
2010* ఈటెల రాజేందర్ తెరాస వి.కృష్ణమోహన్ తెలుగుదేశం పార్టీ
2014 ఈటెల రాజేందర్ తెరాస కేతిరి సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
2018 ఈటెల రాజేందర్ తెరాస కౌశిక్ రెడ్డి పాడి కాంగ్రెస్ పార్టీ

2009 ఎన్నికలు:
2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి తెరాస అభ్యర్థి, సిటింగ్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన కృష్ణమోహన్‌పై 14990 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. మొత్తం 204019 ఓట్లలో 145537 ఓట్లు పోల్ కాగా ఈటెల రాజేందర్‌కు 56752, కృష్ణమోహన్‌కు 41717 ఓట్లు లభించాయి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఈటెల రాజేందర్ శాసనసభ్యత్వానికి రాజీనామా చేయగా ఫిబ్రవరి 15, 2010న స్పీకర్ ఆమోదించారు.

2010 ఉప ఎన్నికలు:
జూలై 2010లో జరిగిన ఉప ఎన్నికలలో తెరాస తరఫున ఈటెల రాజేందర్ మళ్ళీ పోటీచేయగా, కాంగ్రెస్ పార్టీ తరఫున ఎం.దామోదర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ తరఫున వి.కృష్ణమోహన్ పోటీచేశారు. ఈటెల రాజేందర్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దామోదర్ రెడ్డిపై 79 వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించారు. ఈటెల రాజేందర్‌కు 93026 ఓట్లు, దామోదర్ రెడ్డికి 13799 ఓట్లు లభించాయి. కృష్ణమోహన్‌ 12540 ఓట్లు మాత్రమే పొంది డిపాజిట్ కోల్పోయారు. ఈ ఎన్నికలలో భాజపా తెరాసకు మద్దతు ప్రకటించింది. మొత్తం 69 అభ్యర్థులు పోటీచేశారు. ఈ ఎన్నికలలో మొత్తం 202322 ఓట్లలో 142992 ఓట్లు పోల్ అయ్యాయి.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెరాస అభ్యర్థి, సిటింగ్ ఎమ్మల్యే అయిన ఈటెల రాజేందర్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన కేతిరి సుదర్శన్ రెడ్డిపై 56190 ఓట్ల భారీ ఆధిక్యతతో విజయం సాధించారు.

2018 ఎన్నికలు:
2018 ఎన్నికలలో తెరాస తరఫున ఈటెల రాజేందర్, భాజపా తరఫున పుష్పాల రఘు, జనకూటమి తరఫున కాంగ్రెస్ పార్టీకి చెందిన పాడి కౌశిక్ రెడ్డి పోటీచేశారు. తెరాసకు చెందిన ఈటెల రాజేందర్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌశిక్ రెడ్డి పాడి పై 43719 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 
 
2021 ఉప ఎన్నికలు:
2019లో విజయం సాధించిన ఈటెల రాజేందర్ రాజీనామా చేయడంతో ఖాళీ అయిన స్థానానికి 2021 అక్టోబరులో ఎన్నికలు జరుగనున్నాయి. నామినేషన్ల ఉప సంహరణ తర్వాత 30 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. భాజపా తరఫున ఈటెల రాజేందర్, తెరాస తరఫున గెల్లు శ్రీనివాద్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ తరఫున బల్మూరి వెంకట్ పోటీచేస్తున్నారు.


విభాగాలు: కరీంనగర్ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, కరీంనగర్ లోకసభ నియోజకవర్గం, హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక