1, నవంబర్ 2013, శుక్రవారం

దామోదర రాజనర్సింహ (Damodar Raja Narasimha)

 దామోదర రాజనర్సింహ
జననండిసెంబరు 5, 1958
జిల్లామెదక్ జిల్లా
పదవులు3 సార్లు ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి,
నియోజకవర్గంఆందోల్ అ/ని.
దామోదర రాజనర్సింహ (Damodar Raja Narasimha) డిసెంబరు 5, 1958న జన్మించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడైన రాజనర్సింహ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇంజనీరింగ్ విద్య అభ్యసించి, రాజకీయాలలో ప్రవేశించి 1989లో తొలిసారిగా ఆందోల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొంది, ఆ తర్వాత మరో రెండుసార్లు కూడా ఇదే స్థానం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు.

రాజకీయ ప్రస్థానం:
1989లో తొలిసారి మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి విజయం సాధించారు. 1994లో తెలుగుదేశం పార్టీకి చెందిన రాజయ్య, 1999లో బాబుమోహన్ చేతిలో ఓటమి చెందారు. 2004లో రెండోసారి అదే నియోజకవర్గం నుంచి గెలుపొంది, 2006లో వైఎస్సార్ మంత్రివర్గంలో ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా నియమితులైనారు. 2009లో కూడా మూడవసారి ఆందోల్ నుంచి విజయం సాధించి వైఎస్సార్, కొణిజేటి రోశయ్య మంత్రివర్గాలలో స్థానం పొంది, 2010 డిసెంబరులో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో కూడా చోటుపొందారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తెలంగాణ ప్రాంతానికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వవలసి రావడంతో 2011, జూన్ 10న దామోదర రాజనర్సింహకు ఉప ముఖ్యమంత్రి పదవి లభించింది.

కుటుంబం:
దామోదర రాజనర్సింహ తండ్రి సి.రాజనర్సింహ ఆందోల్ నుంచే 3 సార్లు శాసనసభకు ఎన్నికైనారు.

విభాగాలు: మెదక్ జిల్లా రాజకీయ నాయకులు, ఆందోల్ అసెంబ్లీ నియోజకవర్గం, 1958లో జన్మించినవారు, ఆంధ్రప్రదేశ్ మంత్రులు, 9వ శాసనసభ సభ్యులు, 12వ శాసనసభ సభ్యులు, 13వ శాసనసభ సభ్యులు, 13వ శాసనసభ మంత్రులు,


 = = = = =

195

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక