22, మార్చి 2014, శనివారం

ఆందోల్ అసెంబ్లీ నియోజకవర్గం (Andhol Assembly Constituency)

ఆందోల్ అసెంబ్లీ నియోజకవర్గం కరీంనగర్ జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజవర్గంలో 7 మండలాలు కలవు. ఈ సెగ్మెంట్ జహీరాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది.

నియోజకవర్గ పరిధిలోని మండలాలు:
2009 నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఈ నియోజకవర్గం పరిధిలో 7 మండలాలు కలవు.
  • టేక్మల్,
  • అల్లాదుర్గ్,
  • రేగోడ్,
  • రాయికోడ్,
  • ఆందోల్,
  • మునిపల్లి,
  • పులికల్,
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1989 ఎం.రాజయ్య తెలుగుదేశం పార్టీ దామోదర రాజనరసింహ కాంగ్రెస్ పార్టీ
1994 బాబూమోహన్ తెలుగుదేశం పార్టీ దామోదర రాజనరసింహ కాంగ్రెస్ పార్టీ
1999 బాబూమోహన్ తెలుగుదేశం పార్టీ దామోదర రాజనరసింహ కాంగ్రెస్ పార్టీ
2004 దామోదర రాజనరసింహకాంగ్రెస్ పార్టీ బాబూమోహన్ తెలుగుదేశం పార్టీ
2009 దామోదర రాజనరసింహ కాంగ్రెస్ పార్టీ బాబూమోహన్ తెలుగుదేశం పార్టీ
2014 బాబూమోహన్ తెరాస దామోదర రాజనరసింహ కాంగ్రెస్ పార్టీ
2018 చంటి క్రాంతికిరణ్ తెరాస దామోదర రాజనరసింహ కాంగ్రెస్ పార్టీ

2009 ఎన్నికలు:
2009 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, సిటింగ్ ఎమ్మెల్యే దామోదర రాజనరసింహ తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, 2 సార్లు ఎమ్మెల్యే అయిన బాబూమోహన్ పై 2903 ఓట్ల మెజారిటితో విజయం సాధించారు. వీరిరువురు పోటీపడటం ఇది వరసగా 4వ సారి.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెరాస తరఫున పోటీచేసిన బాబూమోహన్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, అవిభక్త రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన దామోదర రాజనరసింహపై 3208 ఓట్ల మెజారిటితో విజయం సాధించి మూడవసారి శాసనసభలో ప్రవేశించారు.

2018 ఎన్నికలు:
2018 ఎన్నికలలో తెరాస తరఫున చంటి క్రాంతికుమార్, భాజపా తరఫున బాబూమోహన్, జనకూటమి తరఫున కాంగ్రెస్ పార్టీకి చెందిన దామోదర రాజనర్సింహ పోటీచేశారు. తెరాసకు చెందిన చంటి క్రాంతికిరణ్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన దామోదర రాజనర్సింహ పై 16465 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.




విభాగాలు: మెదక్ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, జహీరాబాదు లోకసభ నియోజకవర్గం, ఆందోల్ అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక