తిరుమలాయపాలెం ఖమ్మం జిల్లాకు చెందిన మండలము. మండలంలో 18 ఎంపీటీసి స్థానాలు, 40 గ్రామపంచాయతీలు, 25 రెవెన్యూ గ్రామాలు కలవు. సినీనటుడిగా, రాజకీయ నాయకుడిగా పేరుపొందిన బాబూమోహన్ ఈ మండలమునకు చెందినవారు. మండలంలో పాలేరువాగు ప్రవహిస్తోంది. భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలానికి తూర్పున ఖమ్మం గ్రామీణ జిల్లా, దక్షిణాన కూసుమంచి మండలం, ఉత్తరాన మహబూబాబాదు జిల్లా, పశ్చిమాన సూర్యాపేట జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 61581. ఇందులో పురుషులు 30524, మహిళలు 31057. రాజకీయాలు: ఈ మండలము పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం, ఖమ్మం లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. రాష్ట్రమంత్రిగా పనిచేసిన బాబూమోహన్ ఈ మండలానికి చెందినవారు. మండలంలోని గ్రామాలు:
Bachodu, Bandampally, Beerolu, Edullacheruvu, Hasnabad, Hydersaipeta, Jallepally, Jupeda, Kakaravai, Kokkireni, Laxmidevipally, Mahamadapuram, Medidapally, Muzahidpuram, Patharlapadu, Pinampally, Pindiprolu, Raghunadhapalem, Rajaram, Solipuram, Sublaidu, Tallacheruvu, Tettelapadu, Thirumalayapalem, Tippareddygudem
ప్రముఖ గ్రామాలు: .బీరోలు (Birole): బీరోలు ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలమునకు చెందిన గ్రామం. సినీనటుడిగా, రాజకీయ నాయకుడిగా పేరుపొందిన బాబూమోహన్ ఈ గ్రామమునకు చెందినవారు. మాదిరిపురం (Madiripuram): మాదిరిపురం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలమునకు చెందిన గ్రామము. జనవరి 5, 2012న చంద్రబాబు నాయుడు పాదయాత్ర 100 రోజులు పూర్తయిన సందర్భంలో గ్రామంలో 100 అడుగుల పైలాన్ చంద్రబాబుచే ఆవిష్కరించబడింది. ఇవి కూడా చూడండి:
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Thirumalayapalem Mandal in Telugu, Khammam Dist (district) Mandals in telugu, Khammam Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి