మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడైన కమతం రాంరెడ్డి నవంబరు 1, 1938న గండీడ్ మండలం మహమ్మదాబాదులో జన్మించారు. 1967లో తొలిసారిగా ఇండిపెండెంటుగా పోటీచేసి పరిగి నియోజకవర్గం నుంచి విజయం సాధించిన కమతం రాంరెడ్డి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ తరఫున మరో 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా విజయం సాధించడమే కాకుండా ముగ్గురు ముఖ్యమంత్రుల హయంలో మంత్రిపదవి నిర్వహించారు. 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి భాజపాలోకి, 2018లో తెరాసలోకి చేరారు. డిసెంబరు 5, 2020న మహమ్మదాబాదులో మరణించారు.
రాజకీయ ప్రస్థానం: 1967లో తొలిసారి పరిగి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంటుగా పోటీ చేసి విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీలో చేరి చీఫ్ విప్‌గా పదవి పొందరు. 1972లో కాంగ్రెస్ పార్టీ తరఫున అదేస్థానం నుంచి రెండోసారి విజయం సాధించారు. 1980లో ఎమ్మెల్సీగా గెలుపొందారు. 1985లో మళీ పరిగి నుంచి పోటీచేసి తెలుగుదేశం పార్టీకి చెందిన కొప్పుల హరీశ్వర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. 1989లో పరిగి నుంచే పోటీచేసి మూడోసారి ఎమ్మెల్యే అయ్యారు. జలగం వెంగళరావు, నేదురుమల్లి జనార్థన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంత్రివర్గాలలో స్థానం పొందారు. 1999, 2004, 2009లలో వరుసగా 3 సార్లు కొప్పుల హరీశ్వర్ రెడ్డి చేతిలో పరాజయం పొందారు. 2014లో కాంగ్రెస్ పార్టీ టికెట్ రానందున భాజపాలో చేరి తెదేపా, భాజపా కూటమి తరఫున పోటీచేసి ఓడిపోయారు. 2018లో భాజపా నుంచి తెరాసలో చేరారు. ఇవి కూడా చూడండి:
= = = = =
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి