ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా పనిచేసిన కోట్ల విజయభాస్కరరెడ్డి ఆగస్టు 16, 1920న జన్మించారు. ఆయన స్వగ్రామం కర్నూలు జిల్లా లోని లద్దగిరి. మదనపల్లె థియోసాఫికల్ కళాశాలలో ఉన్నత విద్య అభ్యసించారు. మదనపల్లెలో ఉన్నప్పుడే రెండోప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటీష్ వారి తరఫున పాల్గొని లాఠీదెబ్బలు తిని స్పృహకోల్పోయారు. తర్వాత న్యాయశాస్త్ర విద్య అభ్యసించారు. కర్నూలు జడ్పీ అధ్యక్షుడిగా, 5 సార్లు ఎమ్మెల్యేగా, 6 సార్లు ఎంపీగా ఎన్నికకావడమే కాకుండా 2 సార్లు ముఖ్యమంత్రి పదవిని, ముగ్గురు ప్రధానుల హయంలో కేంద్రంలో మంత్రిపదవులు పొందారు. విజయభాస్కరరెడ్డి సెప్టెంబర్ 27, 2001 న మరణించారు.
రాజకీయ ప్రస్థానం: మదనపల్లె కళాశాలలో ఉన్నప్పుడే చిత్తూరు జిల్లా స్టూడెంట్స్ కాంగ్రెస్‌కు అధ్యక్షుడైనారు. 1950లో రాష్ట్ర రాజకీయాలలో ప్రవేశించి కర్నూలు జిల్లా పరిషత్తు అధ్యక్షుడిగా ఎన్నికైనారు. కాసు బ్రహ్మానందరెడ్డి ఇతని శైలి చూసి ఎమ్మెల్యే కాకున్నానూ తన మంత్రివర్గంలో చోటు కల్పించి తర్వాత ఎమ్మిగనూరు నుంచి గెలిపించారు. మొత్తం 5 సార్లు ఎమ్మెల్యేగా, 6 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 6 సార్లు కూడా కర్నూలు లోకసభ నియోజకవర్గం నుంచే ఎన్నికయ్యారు. 1982 మరియు 1992లలో ముఖ్యమంత్రి పదవి పొందారు. కేంద్రంలో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పివి నరసింహరావు మంత్రివర్గాలలో పనిచేశారు. తన సుధీర్ఘ రాజకీయ జీవితంలో అవినీతి ఆరోమణలు లేకుండా కొనసాగారు. 1991లో ఇలస్ట్రేటెద్ వీక్లీ కేంద్రంలోని మంత్రుల నిజాయితీపై సర్వే జరుపగా కోట్ల ప్రథముడిగా నిలిచారు. వ్యక్తిగత జీవితం: 1950లో శ్యామలాదేవితో వివాహం జరిగింది. వీరికి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, రమేష్ రెడ్డి కుమారులు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి 2012లో కేంద్రమంత్రి పదవి పొందారు.
= = = = =
|
6, జులై 2015, సోమవారం
కోట్ల విజయభాస్కర రెడ్డి (Kotla Vijay Bhaskar Reddy)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి