గండీడ్ మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మండలము. అక్టోబరు 11, 2016నఈ మండలం మహబూబ్‌నగర్ జిల్లాలో చేరింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం అప్పటి రంగారెడ్డి జిల్లాలో ఉండేది. మహబూబ్‌నగర్ నుంచి తాండూరు వెళ్ళు ప్రధాన రహదారి మండలం మీదుగా వెళ్ళుచున్నది. మహమ్మదాబాదు మరియు గండీడ్ మండలంలోని ప్రధాన గ్రామాలు. ప్రముఖ రాజకీయ నాయకుడు, ముగ్గురు ముఖ్యమంత్రుల హయంలో మంత్రిగా పనిచేసిన కమతం రాంరెడ్డి ఈ మండలానికి చెందినవారు. సరిహద్దులు: గండీడ్ మండలం మహబూబ్‌నగర్ జిల్లాలో ఉత్తరం వైపున వికారాబాదు జిల్లా సరిహద్దులో ఉంది. ఈ మండలానికి తూర్పున నవాబ్‌పేట మండలం, దక్షిణాన హన్వాడ మరియు కోయిలకొండ మండలాలు, పశ్చిమాన కోస్గి మండలం, ఉత్తరాన వికారాబాదు జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 61683. ఇందులో పురుషులు 30694, మహిళలు 30989. 1991 జనాభాతో పోలిస్తే దశాబ్ద కాలంలో 26.47% వృద్ధి సాధించింది. 2001 లెక్కల ప్రకారం రంగారెడ్డి జిల్లాలో అత్యధిక జనాభా కల మండలాలలో ఇది 17వ స్థానంలో ఉంది. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 70349. ఇందులో పురుషులు 35049, మహిళలు 35300. అక్షరాస్యుల సంఖ్య 34802. రవాణా సౌకర్యాలు: మహబూబ్‌నగర్ నుంచి తాండూరు వెళ్ళు ప్రధాన రహదారి మండలం మీదుగా గండీడ్, మహమ్మదాబాదు గ్రామాలమీదుగా వెళ్ళుచున్నది. నంచర్ల కూడలి నుంచి పరిగి వెళ్ళు రహదారి కూడా ప్రారంభమగును. రాజకీయాలు: ఈ మండలం పరిగి అసెంబ్లీ నియోజకవర్గం, చేవెళ్ళ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2001-06 కాలంలో ఎంపిపిగా అలివేలు అనురాధ, జడ్పీటీసిగా కమతం శ్రీనివాస్ రెడ్డి పనిచేశారు. మండలంలోని గ్రామపంచాయతీలు: బలుసుకొండ, చిన్నవర్వల్, చౌడర్‌పల్లి, గాద్రియాల్, గండీడ్, జక్కలపల్లి, జానంపల్లి, జిన్నారం, జిల్లపల్లి, కొంరెడ్డిపల్లి, కొండాపూర్, మంగంపేట, మహమ్మదాబాద్, ముకర్లాబాద్, నంచెర్ల, పగిడ్యాల్, పెద్దవర్వల్, రంగారెడ్డిపల్లి, రెడ్డిపల్లి, రుసుంపల్లి, సల్కర్‌పేట్, షేక్‌పల్లి, వెంకటరెడ్డిపల్లి, వెన్నచేడ్ మండలంలోని గ్రామాలు: కప్లాపూర్ (Kaplapur), వెన్నాచేడ్ (Vennached), జిన్నారం (Jinnaram), చెలిమిల్ల (Chelmilla), సాలార్‌నగర్ (Salarnagar), పెద్దవర్యాల్ (Peddavarval), చిన్నవర్యాల్ (Chinnavarval), రుసుంపల్లి (Rusumpalle), గండీడ్ (Gandeed), బైస్‌పల్లి (Baispalle), రెడ్డిపల్లి (Reddipalle), సల్కార్‌పేట్ (Salkerpet), గోవిందపల్లి (Govindapalle), పగిడ్యాల్ (Pagdiyal), బల్సుల్‌గొండ (Balsulgonda), కొండాపూర్ (Kondapur), మన్సూర్‌పల్లి (Mansoorpalle), కొంరెడ్డిపల్లి (Komreddipalle), నంచర్ల (Nancherla), గాద్రియాల్ (Gadrial), చౌదర్‌పల్లి (Chowderpalle), మంగంపేట (Mangampet), ముకర్లబాద్ (Mukarlabad), జూలపల్లి (Julapalle), అన్నారెడ్డిపల్లి (Annareddipalle), లింగంపల్లి (Lingaipalle), మహమ్మదాబాద్ (Mohammadabad), సంగాయిపల్లి (Sangaipalle) ప్రముఖ గ్రామాలు / పట్టణాలు మహమ్మదాబాదు (Mahammadabad): మహమ్మదాబాదు మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలమునకు చెందిన గ్రామము. ఈ గ్రామం మహబూబ్‌నగర్ నుంచి తాండూరు వెళ్ళు ప్రధాన రహదారిపై ఉంది. ప్రముఖ రాజకీయ నాయకుడు, ముగ్గురు ముఖ్యమంత్రుల హయంలో మంత్రిపదవి నిర్వహించిన కమతం రాంరెడ్డి ఈ గ్రామానికి చెందినవారు. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Tags: Gandeed Mandal in Telugu, Mahabubnagar Dist information in Telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి