14, జనవరి 2015, బుధవారం

చక్రవర్తుల రాజగోపాలచారి (Chakravarthula Rajagopalachari)

చక్రవర్తుల రాజగోపాలచా
జననండిసెంబరు 10, 1878
రంగంస్వాతంత్ర్యోద్యమం, రాజకీయాలు,
పదవులుముఖ్యమంత్రి, గవర్నరు, గవర్నర్ జనరల్, కేంద్ర మంత్రి,
మరణండిసెంబరు 25, 1972
రాజాజీగా ప్రసిద్ధి చెందిన చక్రవర్తుల (లేదా చక్రవర్తి) రాజగోపాలాచారి స్వాతంత్ర్య సమరయోధుడు మరియు రాజకీయవేత్త. స్వతంత్ర భారతదేశపు గవర్నర్ జనరల్‌గా పనిచేసిన ఏకైన భారతీయుడైన రాజగోపాలచారి డిసెంబరు 10, 1878న ఇప్పటి తమిళనాడులో జన్మించారు. స్వాతంత్ర్యోద్యమంలో ఉంటూనే 1937లో సంయుక్త మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. స్వాతంత్ర్యానంతరం గవర్నరు జనరల్‌గా పదవి చేపట్టి రాజేంద్రప్రసాద్ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టేవరకు కొనసాగినారు. నెహ్రూ మంత్రివర్గంలో హోంశాఖ మంత్రిగా కూడా పనిచేసిన రాజాజీమహాభారతం గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందారు. డిసెంబరు 25, 1972న మరణించిన రాజాజీ 1954లో తొలిసారిగా భారతరత్న పురస్కారం పొందిన ముగ్గురిలో ఒకరు.

రాజకీయ ప్రస్థానం:
1917లో సేలం పట్టణ వార్డు సభ్యునిగా రాజకీయ ప్రస్థానం ఆరంభించిన రాజాజీ ఆ వెంటనే సేలం పురపాలక సంఘం చైర్మెన్ పదవి పొందారు. భారతీయ జాతీయ కాంగ్రెస్ పార్టీలో చురుకుగా ఉంటూ 1923లో నాగ్పూర్‌లో జెండా సత్యాగ్రహం నిర్వహించారు. 1930లో మద్రాసు (ఇప్పటి చెన్నై)లో ఉప్పు సత్యాగ్రహానికి నాయకత్వం వహించారు. 1937లో మద్రాసు ప్రావిన్సు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో ఈయనకు ముఖ్యమంత్రి పదవి లభించింది. దేశానికి స్వాతంత్ర్యం లభించిన తర్వాత 1947-48లో పశ్చిమబెంగాల్ గవర్నరుగా కొనసాగి, 1948లో గవర్నర్ జనరల్ పదవి పొంది జనవరి 26, 1950 వరకు బాధ్యతలు నిర్వహించారు. 1950 డిసెంబరులో సర్దార్ వల్లభ్ భాయి పటేల్ మరణం తర్వాత ఆయన నిర్వహిస్తున్న హోంశాఖను రాజాజీ చేపట్టారు. 1952లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టారు.

విభాగాలు: తమిళనాడు ప్రముఖులు, భారతరత్న పురస్కార గ్రహీతలు, తమిళనాడు ముఖ్యమంత్రులు, పశ్చిమబెంగాల్ గవర్నర్లు, కేంద్ర మంత్రులు, 1878లో జన్మించినవారు, 1972లో మరణించినవారు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక