కేంద్రమంత్రిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన జలగం వెంగళరావు మే 1921లో జన్మించారు. ఖమ్మం జిల్లా బుయన్నగూడెం గ్రామానికి చెందిన వెంగళరావు 4 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు ఎంపీగా ఎన్నికై రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా ఉన్నత పదవులు పొందారు. నా జీవిత కథ పేరుతో ఆత్మకథ రచించిన వెంగళరావు జూన్ 12, 1999న మరణించారు. ఆయన ఇద్దరు కుమారులు కూడా రాజకీయాలలో రాణిస్తున్నారు. రాజకీయ ప్రస్థానం: జలగం వెంగళరావు చిన్న వయస్సులోనే హైదరాబాదు విమోచనోద్యమంలో పాల్గొని జాయిన్ ఇండియా ఉద్యమానికి ఖమ్మం జిల్లాలో నాయకత్వం వహించి జైలుకు వెళ్ళారు. హైదరాబాదు సంస్థానం విమోచన అనంతరం రాజకీయాలలో చేరి 1952లో ఇండిపెండెంటుగా పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత 4 సార్లు సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించారు. ఖమ్మం జిల్లా డిసిసి అధ్యక్షుడిగా, ఖమ్మం జిల్లా తొలి జడ్పీ చైర్మెన్‌గా పనిచేసిన జలగం 1968లో కాసు బ్రహ్మానందరెడ్డి హయంలో హోంశాఖ మంత్రిగా పనిచేశారు. డిసెంబరు 10, 1973 నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియమితులై మార్చి 6, 1978 వరకు పదవిలో ఉన్నారు. 1978లో విమద్‌లాల్ కమీషన్ నివేదిక మేరకు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈయన హయంలోనే 1975లో తొలి తెలుగు ప్రపంచ మహాసభలు నిర్వహించబడ్డాయి మరియు కాకతీయ, నాగార్జున, శ్రీకృష్ణదేవరాలయ విశ్వవిద్యాలయాలు స్థాపించబడ్డాయి. కాంగ్రెస్ పార్టీ చీలిక సమయంలో ఇందిరా కాంగ్రెస్‌లో చేరక బయట ఉండిపోయారు. 1984లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరి రాజీవ్ గాంధీ నేతృత్వంలోని కేంద్ర మంత్రిమండలిలో స్థానం పొందారు. ఏపిసిసి అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. కుటుంబం: జలగం వెంగళరావు కుమారుడు జలగం ప్రసాదరావు రాష్ట్ర మంత్రిగా పనిచేయగా మరో కుమారుడు జలగం వెంకటరావు 2009లో సత్తుపల్లి నుంచి శాసనసభకు ఎన్నికైనారు. సోదరుడు జలగం కొండలరావు 2 సార్లి లోకసభకు ఎన్నికయ్యారు.
= = = = =
|
10, డిసెంబర్ 2014, బుధవారం
జలగం వెంగళరావు (Jalagam Vengal Rao)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి