31, మే 2019, శుక్రవారం

అమిత్ షా (Amit Shah)

 అమిత్ షా
జననంఅక్టోబరు 22, 1964
జన్మస్థానంముంబాయి
పదవులుకేంద్రమంత్రి, భాజపా అధ్యక్షుడు,
పార్టీభాజపా
భారతదేశ ప్రముఖ రాజకీయ నాయకుడైన అమిత్ షా అక్టోబరు 22, 1964న ముంబాయిలో జన్మించారు. అమిత్ షా పూర్తిపేరు అమిత్ అనుల్‌చంద్ర షా. 2014 నుంచి భాజపా జాతీయ అధ్యక్షులుగా ఉన్న అమిత్ షా 2019 లోక్‌సభ ఎన్నికలలో గాంధీనగర్ నుంచి ఎన్నికై మోడీ కేబినెట్‌లో హోంశాఖ మంత్రిగా నియమితులైనారు.

బాల్యం:
అమిత్ షా ముంబాయిలో ఉన్నత కుటుంబంలో జన్మించారు. తండ్రి పివిసి పైపుల వ్యాపారి. మెహసానాలో పాఠశాల విద్య పూర్తిచేసి, అహ్మదాబాదులో ఉన్నత విద్య అభ్యసించారు. బిఎస్సీ (బయోకెమిస్ట్రీ) అభ్యసించి తండ్రికి చేదోడుగా వ్యాపారంలో ప్రవేశించారు. ఆ తర్వాత స్టాక్‌బ్రోకర్‌గా కూడా పనిచేశారు. చిన్నవయస్సు నుంచే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో ఉండగా, కళాశాల దశలో ఆర్.ఎస్.ఎస్.కార్యకర్తగా చేరారు. ఆ సమయంలోనే నరేంద్రమోడితో పరిచయమైంది.

రాజకీయ ప్రస్థానం:
1983లో భాజపా విద్యార్థి విభాగమైన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తులో చేరడంతో అమిత్ షా రాజకీయ ప్రవేశానికి మార్గం సుగమమైంది. 1986లో భాజపాలో చేరారు. 1987లో భాజపా యువ విభాగమైన భారతీయ జనతా యువమోర్చాలో చురుకైన కార్యకర్తగా రాణించారు. BJYM తాలుకా కార్యదర్శిగా, రాష్ట్ర కార్యదర్శిగా, ఉపాధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా పదవులు పొందారు. 1995లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నరేంద్రమోడితో కలిసి గ్రామీణ ప్రాంతాలలో ప్రచారం చేసి భాజపా ప్రభుత్వం రావడానికి తోడ్పడ్డారు. 1997లో ఉప ఎన్నిక ద్వారా తొలిసారి శాసనసభకు ఎన్నికైనారు. 1999లో అహ్మదాబాదు జిల్లా సహకార బ్యాంకు అధ్యక్షపదవి పొందారు. గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షపదవి కూడా అమిత్‌షాకు వరించింది. ఆ తర్వాత 4 సార్లు గుజరాత్ ఎమ్మెల్యేగా ఎన్నికకావడమే కాకుండా నరేంద్రమోడి మంత్రివర్గంలో గుజరాత్ రాష్ట్ర మంత్రిగా స్థానం పొందారు. కాంగ్రెస్ పార్టీ పన్నిన ఫేక్ ఎన్‌కౌంటర్ నుంచి బయటపడ్డారు. 2014 లోకసభ ఎన్నికలకు ముందు ఉత్తరప్రదేశ్ ఇంచార్జిగా ఉంటూ 80 స్థానాలకుగాను భాజపాకు 73 స్థానాలు పొందడంలో కృషిచేసి అందరినీ ఆకర్షించినారు. భాజపా అధ్యక్షుడిగా ఉన్న రాజ్‌నాథ్ సింగ్ కేంద్రమంత్రి కావడంతో భాజపా అధ్యక్షపదవికి అమిత్ షా 2014, జూలై 9న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికలలో ప్రత్యక్షంగా గాంధీనగర్ నుంచి పోటీచేసి విజయం సాధించి మే 30, 2019న తొలిసారిగా కేంద్రమంత్రిమండలిలో స్థానం పొందారు. కేంద్రంలో కీలకమైన హోంశాఖ అమిత్ షాకు లభించింది.

ఇవి కూడా చూడండి:

విభాగాలు: భాజపా జాతీయ అధ్యక్షులు, గుజరాత్ ప్రముఖులు, గుజరాత్ రాజకీయ నాయకులు, భారతీయ జనతాపార్టీ నాయకులు, కేంద్ర మంత్రులు, 1964లో జన్మించినవారు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక