కుల్కచర్ల వికారాబాదు జిల్లాకు చెందిన ఒక మండలము. ఈ మండలము వికారాబాదు రెవెన్యూ డివిజన్, పరిగి అసెంబ్లీ నియోజకవర్గం, చేవెళ్ళ లోకసభ నియోజకవర్గంలో భాగము. మహబూబ్ నగర్ నుంచి పరిగి వెళ్ళు ప్రధాన రహదారి ఈ మండలము గుండా వెళుతుంది. ప్రముఖ శివాలయం పాంబండ రామలింగేశ్వరస్వామి దేవస్థానం మండల కేంద్రం కుల్కచర్లకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. అతివిశాలమైన మర్రిచెట్టుకు పేరుగాంచిన మరికల్, నిజాంనవాబుల కట్టడాలు కలిగిన ముజాహిద్‌పూర్ మండలం పరిధిలో కలవు. 1986 మండల వ్యవస్థకు పూర్వం ఇది పరిగి తాలుకాలో భాగంగా ఉండేది. 2016 అక్టోబరు 11న ఈ మండలం కొత్తగా ఏర్పడిన వికారాబాదు జిల్లాలో చేర్చబడింది. 2016 జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో ఈ మండలంలోని కొన్ని గ్రామాలు మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలంలో విలీనం చేశారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న చౌడాపూర్ మండలంలో మళ్ళీ ఈ మండలానికి చెందిన 7 రెవెన్యూ గ్రామాలు కలుపుతున్నారు. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలం జిల్లాలో దక్షిణ సరిహద్దులో ఉంది. మండలానికి ఉత్తరాన దోమ మండలం మరియు పరిగి మండలం, తూర్పున రంగారెడ్డి జిల్లా, పశ్చిమాన మరియు దక్షిణాన మహబూబ్‌నగర్ జిల్లా సరిహద్దులుగా కలవు. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 69522. ఇందులో పురుషులు 35369, మహిళలు 34153. అక్షరాస్యుల సంఖ్య 32893. అక్షరాస్యత శాతం 54.28%. ఇది జిల్లాలో అత్యధిక అక్షరాస్యత శాతం కల మండలాలలో చివరి నుంచి రెండవ స్థానంలో ఉంది. రవాణా సౌకర్యాలు: మహబూబ్‌నగర్ నుంచి పరిగి వెళ్ళు ప్రధాన రహదారి మండలం గుండా వెళ్ళుచున్నది. పుట్టాపహాడ్, కులకచర్ల ఈ రహదారిపై ఉన్న ముఖ గ్రామాలు. కులకచర్ల నుంచి తూర్పుకు నవాబ్‌పేట, పడమరన కోస్గి వెళ్ళు రహదారులున్నాయి. రాజకీయాలు: కుల్కచర్ల మండలం పరిగి అసెంబ్లీ నియోజకవర్గం, చేవెళ్ళ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2019 ప్రాదేశిక ఎన్నికలలో ఎంపీపీగా తెరాసకు చెందిన సత్యమ్మ ఎన్నికయ్యారు. వ్యవసాయం, పంటలు: మండలంలో ముఖ్యమైన పంట గోధుమ. దీని 1200 హెక్టార్లలో, వరి పంటను ఖరీఫ్, రబీలలో కలిపి 1000 హెక్టార్లలో పండిస్తారు. కందులు 500 హెక్టార్లలో, మొక్కజొన్న 150 హెక్టార్లలో సాగిచేస్తారు. విద్యాసంస్థలు: మండలంలోని ఉన్నత పాఠశాలలు: జడ్పీ పాఠశాల కులకచర్ల, జడ్పీ పాఠశాల (బాలికల) కులకచర్ల, కరణం వెంకటరావు స్మారక పాఠశాల కులకచర్ల, జడ్పీ పాఠశాల బండఎల్కచర్ల, జడ్పీ పాఠశాల ఇప్పాయిపల్లి, జడ్పీ పాఠశాల పుట్టాపహాడ్, జడ్పీ పాఠశాల చౌడాపూర్, జడ్పీ పాఠశాల మరికల్, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల (బాలుర) బండ ఎల్కిచెర్ల, జడ్పీ పాఠశాల మందిపల్, జడ్పీ పాఠశాల కొత్తపల్లి, జడ్పీపాఠశాల చాకలపల్లి, జడ్పీ పాఠశాల ముజాహిద్‌పూర్.
= = = = =
|
5, జులై 2013, శుక్రవారం
కుల్కచర్ల మండలము (Kulkacharla Mandal)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి