నవాబ్ పేట్ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఒక మండలము. ఇది జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్నది. ఈ మండలము మహబూబ్‌నగర్ రెవెన్యూ డివిజన్, జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. మండలంలో 24 గ్రామపంచాయతీలు, 27 రెవెన్యూ గ్రామాలున్నాయి. కాకర్లపహాడ్ పంచాయతి పరిధిలో మైసమ్మ దేవాలయం ఉంది. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 52070. చరిత్రలో వెండికొండగా భాసిల్లిన ఎల్లంకొండ ఈ మండలంలోనే ఉంది. మండల వ్యవస్థకు ముందు ఈ మండలంలోని గ్రామాలు మహబూబ్‌నగర్, షాద్‌నగర్ తాలుకాలలో ఉండేవి. 2019 లోక్‌సభ ఎన్నికలలో మహబూబ్‌నగర్ ఎంపిగా విజయం సాధించిన మన్నె శ్రీనివాస్ రెడ్డి మండలంలోని గురుకుంట గ్రామానికి చెందినవారు.
సరిహద్దులు: ఈ మండలమునకు ఉత్తరమున కొందుర్గ్ మండలము, ఈశాన్యమున షాద్ నగర్ మండలము, తూర్పున బాలానగర్ మండలము, ఆగ్నేయాన జడ్చర్ల మండలము, దక్షిణాన మహబూబ్ నగర్ మండలము, నైరుతివైపున హన్వాడ మండలము, పశ్చిమాన రంగారెడ్డి జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 48795. ఇందులో పురుషులు 24791, మహిళలు 24004. 2011 జనాభా లెక్కల ప్రకారం మండల జనాభా 52070. ఇందులో పురుషులు 26378, మహిళలు 25692. అక్షరాస్యుల సంఖ్య 24666. రవాణా సౌకర్యాలు: మండలంలోని ప్రధాన గ్రామపంచాయతీలకు బీటి రోడ్డు సదుపాయం ఉంది. మండల కేంద్రం నుంచి షాద్‌నగర్, మహబూబ్‌నగర్ లకు రోడ్డు సౌకర్యం ఉంది. మండలానికి రైలు సదుపాయం లేదు. సమీపంలోని రైల్వే స్టేషన్లు మహబూబ్‌నగర్, షాద్‌నగర్. రాజకీయాలు: ఈ మండలము జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2009కు ముందు 13 పంచాయతీలు జడ్చర్ల నియోజకవర్గంలో, 11 పంచాయతీలు షాద్‌నగర్ నియోజకవర్గంలో ఉండేవి. 2001 జడ్పీటీసి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పి.రంగారావు, 2006 జడ్పీటీసి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి చెందిన డబ్బు స్వరూప ఎన్నికయ్యారు. 2014లో ఎంపీపీగా తెరాస పార్టీకి చెందిన శ్రీనయ్య ఎన్నికయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికలలో మహబూబ్‌నగర్ ఎంపిగా విజయం సాధించిన మన్నె శ్రీనివాస్ రెడ్డి మండలంలోని గురుకుంట గ్రామానికి చెందినవారు.
మండలంలో 56 ప్రాథమిక పాఠశాలలు (1 ప్రభుత్వ, 55 మండల పరిషత్తు), 11 ప్రాథమికోన్నత పాఠశాలలు (7 మండల పరిషత్తు, 4 ప్రైవేట్), 11 ఉన్నత పాఠశాలలు (1 ప్రభుత్వ, 9 జడ్పీ, 1 ప్రైవేట్), ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉన్నది. వ్యవసాయం, నీటిపారుదల మండలం మొత్తం విస్తీర్ణం 20744 హెక్టార్లలో 41% భూమి వ్యవసాయ యోగ్యంగా ఉన్నది. మండలంలో పండించే ప్రధాన పంటలు మొక్కజొన్న,వరి. కందులు, జొన్నలు, ప్రత్తి కూడా పండిస్తారు. మండల సాధారణ వర్షపాతం 609 మిమీ. మండలంలో సుమారు 2700 హెక్టార్లకు నీటిపారుదల సౌకర్యంఉంది.
|
22, జనవరి 2013, మంగళవారం
నవాబ్ పేట్ మండలము (Nawabpet Mandal)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి