23, జనవరి 2013, బుధవారం

కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం (Kollapur Assembly Constituency)

మహబూబ్ నగర్ జిల్లా లోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ నియోజకవర్గం 5 మండలాలు కలవు. పునర్విభజన ఫలితంగా ఇదివరకు నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో భాగంగా ఉన్న కొన్ని గ్రామాలు కూడా ఇప్పుడు ఈ నియోజకవర్గంలో కలిశాయి. 1952 నుండి ఇప్పటివరకు ఒక ఉప ఎన్నికతో సహా మొత్తం 14 సార్లు ఎన్నికలు జరుగగా కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 8 సార్లు విజయం సాధించగా, 3 సార్లు ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందినారు. తెలుగుదేశం పార్టీ, కమ్యూనిష్టు, తెరాస అభ్యర్థులు ఒక్కోసారి విజయం పొందినాయి. 1978-85 మధ్యన కొత్త వెంకటేశ్వర్లు వరసగా 3 సార్లు విజయం సాధించగా, ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాన్న జూపల్లి కృష్ణారావు వరసగా 4వ సారి విజయం సాధించారు.

(కొల్లాపూర్ శాసనసభ నియోజకవర్గం)
(చిత్రం: తెవికీ సౌజన్యంతో - సభ్యుడు దేవా)
ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు

నియోజకవర్గపు చరిత్ర
కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. అప్పటి నుండి జరిగిన 15 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 8 సార్లు, ఇండిపెండెంట్ అభ్యర్థులు 3 సార్లు విజయం సాధించగా, తెరాస 2 సార్లు, తెలుగుదేశం పార్టీ, సి.పి.ఐ., పార్టీలు ఒక్కొక్క సారి గెలుపొందినాయి. 1952లో జరిగిన మొదటి ఎన్నికలలో కమ్యూనిష్టుల మద్దతుతో పి.డి.ఎఫ్. అభ్యర్థి గెలువగా, 1957లో విజయం సాధించిన నర్సింగరావు మంత్రివర్గంలో స్థానం పొందినారు. 1962లో కాంగ్రెస్ పార్టీకి చెందిన కె.రంగదాసు విజం సాధించారు. 1967లో కూడా మళ్ళీ కాంగ్రెస్ టికెట్టు రంగదాసుకే లభించగా కాంగ్రెస్ పార్టీ వారే వ్యతిరేకించి ఇండిపెండెంట్ అభ్యర్థి నర్సింహారెడ్డిని గెలుపించుకున్నారు. 1972లో రంగదాసుకు టికెట్టు లభించకున్ననూ ఇండిపెండెంట్‌గా పోటీకి దిగి విజయం సాధించారు. 1978, 83, 85 లలో కొత్త వెంకటేశ్వరరావు వరసగా మూడు సార్లు గెలిచి హాట్రిక్ సాధించారు. 1989లో వెంకటేశ్వరరావు సోదరుడు కొత్త రామచంద్రారావు కాంగ్రెస్ తరఫున గెలిచారు. 1994లో ఇద్దరు సోదరులు (కాంగ్రెస్, ఇండిపెండెంట్) పోటీపడడంతో తొలిసారిగా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం గెలుపొందినది. మధుసూధరావు బంధువు జూపల్లి కృష్ణారావు 1999లో కాంగ్రెస్ పార్టీ తరఫున, 2004లో కాంగ్రెస్ రెబల్‌గా ఇండిపెండెంట్‌గా పోటీచేసి గెలిచినారు. అప్పటి నుంచి జూపల్లి వరస విజయాలు సాధించారు. తొలి 3 సార్లు కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందగా తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి 2012 ఉపఎన్నికలలో తెరాస తరఫున పోటీచేసి విజయం సాధించారు. 2014లో జూపల్లి తెలంగాణ తొలి మంత్రివర్గంలో స్థానం కూడా పొందారు. 2018లో మాత్రం జూపల్లి ఓడిపోయారు.

ఎన్నికైన శాసనసభ్యులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1952 అనంత రామచంద్రారెడ్డి పి.డి.ఎఫ్ టి.శాంతాబాయి కాంగ్రెస్ పార్టీ
1957 మందుగుల నర్సింగరావు కాంగ్రెస్ పార్టీ కె.గోపాలరావు పి.డి.ఎఫ్
1962 కె.రంగదాస్ కాంగ్రెస్ పార్టీ కె.గోపాలరావు సి.పి.ఐ
1967 బి.నర్సింహారెడ్డి స్వతంత్ర అభ్యర్థి కె.రంగదాస్ కాంగ్రెస్ పార్టీ
1972 కె.రంగదాస్ స్వతంత్ర అభ్యర్థి కొత్త వెంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ
1978 కొత్త వెంకటేశ్వరరావు ఇందిరా కాంగ్రెస్ కె.రంగదాస్ జనతా పార్టీ
1983 కొత్త వెంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ వి.కృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ
1985 కొత్త వెంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ సురవరం సుధాకర్ రెడ్డి సి.పి.ఐ
1989 కొత్త రామచంద్రరావు కాంగ్రెస్ పార్టీ సురవరం సుధాకర్ రెడ్డి సి.పి.ఐ
1994 కె.మధుసూధన్ రావు తెలుగుదేశం పార్టీ కొత్త రామచంద్రరావు కాంగ్రెస్ పార్టీ
1999 జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీ కె.మధుసూదన్ రావు తెలుగుదేశం పార్టీ
2004 జూపల్లి కృష్ణారావు స్వతంత్ర అభ్యర్థి కె.మధుసూదన్ రావు తెలుగుదేశం పార్టీ
2009 జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీ జగదీశ్వర్ రావు తెలుగుదేశం పార్టీ
2012 (ఉ) జూపల్లి కృష్ణారావు తెలంగాణ రాష్ట్ర సమితి

2014 జూపల్లి కృష్ణారావు తెలంగాణ రాష్ట్ర సమితి హర్షవర్థన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
2018 హర్షవర్థన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జూపల్లి కృష్ణారావు తెరాస

1983 ఎన్నికలు
1983లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొత్త వెంకటేశ్వరరావు తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వంగూరు కృష్ణారెడ్డిపై 12708 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందినారు. వెంకటేశ్వరరావుకు 39241 ఓట్లు రాగా, కృష్ణారెడ్డి 26533 ఓట్లు సాధించారు. రంగంలో ఉన్న జనతాపార్టీ అభ్యర్థికి 16600 ఓట్లు వచ్చాయి.

1999 ఎన్నికలు
1999 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన కె.మధుసూధనరావుపై 5305 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందినారు. జూపల్లి కృష్ణారావుకు 54677 ఓట్లు రాగా, మధుసూధనరావు 49372 ఓట్లు పొందినారు. మొత్తం నలుగురు అభ్యర్థులు పోటీ చేయగా ప్రధాన పోటీ వీరిద్దరి మధ్యనే కొనసాగింది. బరిలో ఉన్న మరో ఇద్దరు అభ్యర్థులు డిపాజిట్టు కోల్పోయారు.

2004 ఎన్నికలు
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీచేసిన జూపల్లి కృష్ణారావు తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన కటికనేని మధుసూదనరావుపై 2944 ఓట్ల మెజారిటీతో గెలుపొందినారు. కృష్ణారావుకు 49254 ఓట్లు రాగా, మధుసూదనరావుకు 46310 ఓట్లు లభించాయి. పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఈ స్థానాన్ని తెలంగాణ రాష్ట్ర సమితికి కేటాయించగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కృష్ణారావు రెబెల్ అభ్యర్థిగా పోటీలోకి దిగి విజయం సాధించారు.

2009 ఎన్నికలు
2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున సిటింగ్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు మళ్ళీ పోటీచేయగా, తెలుగుదేశం పార్టీ తరఫున జగదీశ్వర్ రావు పోటీ పడ్డారు. భారతీయ జనతా పార్టీ తరఫున వి.నరేందర్ రావు, ప్రజారాజ్యం పార్టీ మద్దతుతో మనపార్టీకి చెందిన కె.నర్సింహయ్య, లోక్‌సత్తా పార్టీ తరఫున పి.విష్ణువర్థన్ రెడ్డ్ పోటీచేశారు.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కృష్ణారావు తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సి.జగదీశ్వర్ రావుపై 1700కుపైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెరాసకు చెందిన జూపల్లి కృష్ణారావు తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన హర్షవర్థన్ రెడ్డీపై 10498 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.

2018 ఎన్నికలు:
2018 ఎన్నికలలో తెరాస తరఫున జూపల్లి కృష్ణారావు, భాజపా తరఫున సుధాకర్ రావు, ప్రజాకూటమి తరఫున కాంగ్రెస్ పార్టీకి చెందిన బీరం హర్షవర్థన్ రెడ్డి పోటీచేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన బీరం హర్హవర్థన్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, తెరాసకు చెందిన జూపల్లి కృష్ణారావు పై 12543 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

నియోజకవర్గపు ప్రముఖులు


విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు,  నాగర్‌కర్నూల్ లోకసభ నియోజకవర్గం,  కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం,  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాలు,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక