5, ఏప్రిల్ 2013, శుక్రవారం

పాలమూరు జిల్లా కవిత (Palamuru Jilla Kavitha)

పాలమూరు జిల్లా కవిత
-- రచన: సి.చంద్ర కాంత రావు


నవబ్రహ్మల దివ్యధామం ఆలంపురం
కల్యాణి చాళుక్యుల చరిత కల గంగాపురం
కాకతీయుల కాలంలో వర్థిల్లిన వర్థమానపురం
ఇన్ని విశేషాల ఖిల్లా మన పాలమూరు జిల్లా


ప్రాచీన రాజధానిగా వర్థిల్లిన ఇంద్రకల్లు
రామలింగేశ్వరుడు వెలిసిన రాయకల్లు
ఇన్ని విశేషాల ఖిల్లా మన పాలమూరు జిల్లా


కోవెలలు నెలకొన్న కోయిలకొండ
వేంకటేశుడు వెలిసిన మన్యంకొండ
వెండికొండలా భాసిల్లే ఎల్లంకొండ
ఇన్ని పర్యాటకల ఖిల్లా మన పాలమూరు జిల్లా


కృష్ణానది రాష్ట్రంలో ప్రవేశించే తంగడి
పెబ్బేరులో నిర్వహించే అతిపెద్ద అంగడి
అమిస్తాపూర్ లో గొర్రె ఉన్నితో నేసే గొంగడి
ఇన్ని విశేషాల ఖిల్లా మన పాలమూరు జిల్లా


కురుమూర్తిలో కొలువైన శ్రీవెంకటాద్రి
గద్వాల కోటను కట్టించిన నల్లసోమనాద్రి
ఇన్ని ప్రత్యేకతల ఖిల్లా మన పాలమూరు జిల్లా


శ్రీశైలం ఉత్తరద్వారంగా భాసిల్లే ఉమామహేశ్వరం
నల్లమల అడవుల్లో ప్రకృతి రమణీయ సలేశ్వరం
కృష్ణ-తుంగభద్రలు కలిసే సంగమేశ్వరం
ఇన్ని విశేషాల ఖిల్లా మన పాలమూరు జిల్లా


సుందర ప్రకృతి దృశ్యాల ఫరహాబాదు
చారిత్రక కట్టడాల నసరుల్లాబాదు
పెద్దచెరువు నెలకొన్న దౌల్తాబాదు
ఇన్ని ప్రత్యేకతల ఖిల్లా మన పాలమూరు జిల్లా


రజాకార్లను ఎదిరించిన అప్పంపల్లి
ఉత్తమ పంచాయతి అవార్డులు పొందిన హాజిపల్లి
ఎల్లమ్మ దేవత వెలసిన పోలెపల్లి
ఇన్ని ప్రత్యేకతల ఖిల్లా మన పాలమూరు జిల్లా


చాళుక్యులు కట్టించిన పానగల్లు కోట
మట్టితో నిర్మించిన అతిపెద్ద గద్వాల కోట
తుంగభద్ర తీరాన వెలసిన రాజోలి కోట
ఇన్ని కోటల ఖిల్లా మన పాలమూరు జిల్లా


తెలంగాణ కేసరిగా పేరొందిన పల్లెర్ల హన్మంతరావు
వందేమాతరంతో ప్రసిద్ధి నొందిన రామచంద్రారావు
వనపర్తి సంస్థానాధీశుడు రాజా రామేశ్వర్ రావు
ఇందరు వర్థిల్లిన ఖిల్లా మన పాలమూరు జిల్లా



పాలెంకు గుర్తింపు తెచ్చిన తోటపల్లి
ఇన్ని విశేషాల ఖిల్లా మన పాలమూరు జిల్లా


కృష్ణానదిపై ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు
ఊకశెట్టిపై కట్టిన కోయిలసాగర్ ప్రాజెక్టు
ఆసియాలో తొలి ఆటో సిస్టన్ సరళాసాగర్ ప్రాజెక్టు
ఇన్ని ప్రాజెక్టుల ఖిల్లా మన పాలమూరు జిల్లా


పట్టు చీరలకు ప్రసిద్ధి నారాయణపేట
బాషారాష్ట్రాలకునాంది మాధవరావుపేట
ఇన్ని ప్రత్యేకతల ఖిల్లా మన పాలమూరు జిల్లా


ఎక్లాస్ పూర్ లో ఔదుంబరేశ్వరాలయం
కూడవెల్లిలో వెలసిన సంగమేశ్వరాలయం
ఉప్పునూతలలో ప్రాచీన కేదేశ్వరాలయం
ఇన్ని శైవక్షేత్రాల ఖిల్లా మన పాలమూరు జిల్లా


సురభి రాజులు ఏలిన కొల్లాపురం
శతాబ్దాల ఘన చరిత్ర కలిగిన ఘనపురం
ఇన్ని విశేషాల ఖిల్లామన పాలమూరు జిల్లా


నిజాం విమోచనోద్యమకారుడు పాగ పుల్లారెడ్డి
కమ్యూనిస్ట్ జాతీయ నాయకుడు సుధాకర్ రెడ్డి
రంగనాథ రామాయణ కర్త గోన బుద్ధారెడ్డి
ఇందరు వర్థిల్లిన ఖిల్లా మన పాలమూరు జిల్లా


ఎన్టీయార్ ను ఓడించిన చిత్తరంజనుడు
పాలమూరు స్టేషన్ లో జనించిన ప్రమోద్ మహాజనుడు
గంగాపూర్ ఆలయాన్ని కట్టించిన సోమేశ్వరుడు
ఇందరు పుట్టిన ఖిల్లా మన పాలమూరు జిల్లా


ప్రాచీన కోట కొలువైన పానగల్లు
మైసిగండి మైసమ్మ వెలసిన ఆమనగల్లు
ఇన్ని విశేషాల ఖిల్లా మన పాలమూరు జిల్లా


సాహితీవేత్తగా పేరొందిన గడియారం రామకృష్ణ
దక్షిణ సరిహద్దుగా ప్రవహిస్తున్న తుంగభద్ర-కృష్ణ
క్షీరలింగేశ్వరాలయం కొలువైన క్షేత్రం కృష్
ఇన్ని విశేషాల ఖిల్లా మన పాలమూరు జిల్లా


మన్ననూరులో గిరిజన చెంచులక్ష్మి మ్యూజియం
పిల్లలమర్రి ప్రక్కన వెలిసిన సైన్సు మ్యూజియం
ఆలంపూర్‌లో అపురూప పురావస్తు మ్యూజియం
ఇన్ని మ్యూజియంల ఖిల్లా మన పాలమూరు జిల్లా


సప్తనదుల సంగమస్థానంలో సంగమేశ్వర క్షేత్రం
లింగమయ్య కొలువైన సలేశ్వర క్షేత్రం
కోయిలకొండలో నెలకొన్న శ్రీరామకొండ క్షేత్రం
ఇన్ని క్షేత్రాల ఖిల్లా మన పాలమూరు జిల్లా


తెలంగాణ వైతాళికుడు ప్రతాపరెడ్డి
నిజాంల కొత్వాలు వెంకట్రాంరెడ్డి
గవర్నరుగా పనిచేసిన సత్యనారాయణరెడ్డి
ఇందరు పుట్టిన ఖిల్లా మన పాలమూరు జిల్లా


గద్వాల సంస్థానం తొలి రాజధాని పూడురు
వనపర్తి సంస్థానాధీశులు పాలించిన సూగూరు
ఇన్ని ప్రత్యేకతల ఖిల్లా మన పాలమూరు జిల్లా


కొల్లాపూర్‌ను పాలించిన జటప్రోలు సంస్థానం
కవిపండితులను పోషించిన గద్వాల సంస్థానం
సప్తసముద్రాలకు పేరొందిన వనపర్తి సంస్థానం
ఇన్ని సంస్థానాల ఖిల్లా మన పాలమూరు జిల్లా


ఆదిమానవుల ఆనవాళ్ళున్న మడుమాల్
శ్రీనివాస్ రావు జన్మించిన గుండుమాల్
అతిపెద్ద ధ్యానమందిరం వెలిసిన కడ్తాల్
ఇన్ని విశేషాల ఖిల్లా మన పాలమూరు జిల్లా


ముఖ్యమంత్రిగా పనిచేసిన బూరుగుల
చారిత్రక అవశేషాలు బయల్పడిన అందుగుల
సమరయోధుడిగా ప్రసిద్ధినొందిన మందుముల
ఇన్ని విశేషాల ఖిల్లా మన పాలమూరు జిల్లా


రాష్ట్రంలో తొలి పంచాయతి సమితి షాద్‌నగర్
పిల్లలమర్రి పర్యాటకం నెలకొన్న మహబూబ్‌నగర్
జాతీయ రహదారిపై ఉన్న చారిత్రక బాలానగర్
ఇన్ని ప్రత్యేకతల ఖిల్లా మన పాలమూరు జిల్లా


రంగనాథస్వామి కొలువైన మొగిలిగిద్ద
మాణిక్యేశ్వరి మాత సమీపంలో నున్న దామరగిద్ద
హర్యానా గేదెలతో అభివృద్ధి చెందిన కోతులగిద్ద
ఇన్ని విశేషాల ఖిల్లా మన పాలమూరు జిల్లా


కృష్ణా-తుంగభద్రల మద్య ప్రాంతం నడిగడ్డ
కృష్ణానది మధ్యలో వెలిసిన ద్వీపం గుర్రంగడ్డ
దత్తాత్రేయ ఆలయం నెలకొన్న కురుంగడ్డ
ఇన్ని ప్రత్యేకతల ఖిల్లా మన పాలమూరు జిల్లా


మండలాల సంఖ్య అరువదినాలుగు
జాతీయ రహదారి సంఖ్య నలుబదినాలుగు
ఇన్ని ప్రత్యేకతల ఖిల్లా మన పాలమూరు జిల్లా



హేమలాపురగా వర్థిల్లిన ఆలంపురం
కొలుములపల్లెగా పేరొందిన కొల్లాపురం
జానంపేటగా పిలవబడ్డ ఫరూఖ్‌నగరం
ఇన్ని ప్రత్యేకతల ఖిల్లా మన పాలమూరు జిల్లా 
= = = = = = = = = = =  = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = =

5 కామెంట్‌లు:

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక