మహబూబ్‌నగర్ జిల్లా లోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ నియోజకవర్గంలో 2 మండలాలు కలవు. పునర్విభజనకు ముందు ఉన్న కోయిలకొండ మండలం కొత్తగా ఏర్పడిన నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గంలో కలవగా, కొత్తగా హన్వాడ మండలం ఈ నియోజకవర్గంలో భాగమైంది. పులివీరన్న, పి.చంద్రశేఖర్‌లు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొంది రాష్ట్ర మంత్రివర్గంలో పదవులు నిర్వహించినారు. 2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన ఎన్.రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించగా, రాజేశ్వర్ రెడ్డి మరణంతో 2012 మార్చిలో జరిగిన ఉప-ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి యెన్నం శ్రీనివాసరెడ్డి విజయం సాధించారు. 2014లో తెరాసకు చెందిన వి.శ్రీనివాస్ గౌడ్ గెలుపొందినారు. 2018లో రెండోసారి విజయం సాధించిన శ్రీనివాస్ గౌడ్ కేసీఆర్ మంత్రివర్గంలో స్థానం పొందారు.
ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు నియోజకవర్గ భౌగోళిక సరిహద్దులు కేవలం రెండే మండలాలతో ఈ నియోజకవర్గం జిల్లాలోనే భౌగోళికంగా చిన్న నియోజకవర్గంగా మారింది. మహబూబ్ నగర్ పట్టణ జనాభా అధికంగా ఉండుటచే అధిక మండలాలు కలిసే వీలు లేకపోయింది. ఈ నియోజకవర్గానికి ఉత్తరాన రంగారెడ్డి జిల్లాకు చెందిన పరిగి అసెంబ్లీ నియోజకవర్గం ఉండగా, తూర్పున జడ్చర్ల, దక్షిణమున దేవరకద్ర, పడమర వైపున నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.
ఎన్నికైన శాసనసభ్యులు
1999 ఎన్నికలు 1999లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీకి చెందిన పి.చంద్రశేఖర్ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన పులి వీరన్నపై 6688 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. చంద్రశేఖర్ 51065 ఓట్లు సాధించగా, పులివీరన్నకు 44377 ఓట్లు లభించాయి. 2004 ఎన్నికలు 2004 శాసనసభ ఎన్నికలలో మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థి పులి వీరణ్ణ తన సమీప ప్రత్యర్థి, మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీకి చెందిన పి.చంద్రశేఖర్‌పై 19282 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు వలన ఈ స్థానం తెరాసకు కేటాయించగా కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి పులి వీరన్న రెబెల్ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించాడు. పులి వీరణ్ణకు 63110 ఓట్లు రాగా, మాజీ మంత్రి అయిన పి.చంద్రశేఖర్‌కు 43828 ఓట్లు వచ్చాయి. మొత్తం 12 అభ్యర్థులు పోటీచేయగా టి.ఆర్.ఎస్.అభ్యర్థితో సహా 10 మంది అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారు. మొదటి రెండు స్థానాలలో ఉన్న పులివీరన్న మరియు పి.చంద్రశేఖర్‌లు పోలైన ఓట్లలో 858% ఓట్లు పొందగా మిగితా 10 అభ్యర్థులు కలిపి కేవలం 14.2% ఓట్లు పొందినారు. ఇక్కడ బహుముఖ పోటీ జరిగిననూ ప్రధాన పోటీ ఇండిపెండెంట్ అభ్యర్థి, తెలుగుదేశం అభ్యర్థుల మధ్యనే జరిగింది. 2009 ఎన్నికలు 2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున సిటింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పులి వీరన్న మళ్ళీ పోటీచేయగా, భారతీయ జనతా పార్టీ తరఫున జి.పద్మజా రెడ్డి, ప్రజారాజ్యం పార్టీ తరఫున అమృత్ ప్రసాద్ గౌడ్ మరియు లోక్‌సత్తా తరఫున బెక్కరి రాంరెడ్డిలు పోటీచేశారు. పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ మద్దతుతో మహాకూటమి తరఫున తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన సయ్యద్ ఇబ్రహీం పోటీచేశాడు. ప్రజారాజ్యం పార్టీ టికెట్టును ఆశించి టికెట్టు లభించకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన ఎన్.రాజేశ్వర్ రెడ్డికి, టి.ఆర్.ఎస్.అభ్యర్థి సయ్యద్ ఇబ్రహీం, కాంగ్రెస్ అభ్యర్థి పులివీరన్నల మధ్య ప్రధానపోటీ జరుగగా ఎన్.రాజేశ్వర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిపై 5137 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. రాజేశ్వర్ రెడ్డి అక్టోబరు 30, 2011న మరణించడంతో శాసనసభ స్థానం ఖాళీ అయింది. 2012 ఉప ఎన్నికలు ఎన్.రాజేశ్వర్ రెడ్డి మరణంతో ఖాళీ అయిన స్థానంలో జరుగనున్న 2012 ఉప ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున యెన్నం శ్రీనివాసరెడ్డి, తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున సయ్యద్ ఇబ్రహీం, కాంగ్రెస్ పార్టీ తరఫున ముత్యాల ప్రకాష్ పోటీచేశారు. ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి యెన్నం శ్రీనివాసరెడ్డి తన సమీప ప్రత్యర్థి తెరాసకు చెందిన ఇబ్రహీంపై 1859 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముత్యాల ప్రకాష్‌కు మూడవస్థానం లభించగా, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పి.చంద్రశేఖర్ నాలుగోస్థానం లభించింది. 2014 ఎన్నికలు: 2014 శాసనసభ ఎన్నికలలో ఇక్కడి నుంచి తెరాస తరఫున పోటీచేసిన శ్రీనివాస్ గౌడ్ తన సమీప ప్రత్యర్థి, భాజపాకు చెందిన సిటింగ్ ఎమ్మెల్యే అయిన యెన్నం శ్రీనివాస్ రెడ్డిపై 2535 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించారు. 2018 ఎన్నికలు: 2018 శాసనసభ ఎన్నికలలో తెరాస తరఫున వి.శ్రీనివాస్ గౌడ్, భాజపా తరఫున టి.పద్మజారెడ్డి, ప్రజాకూటమి తరఫున తెలుగుదేశం పార్టీకి చెందిన ఎర్ర శేఖర్ పోటీచేశారు. తెరాసకు చెందిన వి.శ్రీనివాస్ గౌడ్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎం.చంద్రశేఖర్ పై 57775 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి వరసగా రెండోసారి శాసనసభలో ప్రవేశించారు. నియోజకవర్గ ప్రముఖులు:
|
23, జనవరి 2013, బుధవారం
మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం (Mahabubnagar Assembly Constituency)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి