డి..కె.సత్యారెడ్డి జోగులాంబ గద్వాలకు చెందిన రాజకీయ నాయకుడు. 1978లో జనతాపార్టీ తరఫున గద్వాల నియోజకవర్గం నుంచి పోటీచేసి ప్రముఖ స్వాతంత్ర్యసమరయోధుడు, కాంగ్రెస్ పార్టి అభ్యర్థి అయిన పాగపుల్లారెడ్డిపై విజయం సాధించారు. ఎమ్మెల్యేగా ఉంటూ మరణించగా 1980లో జరిగిన ఉప ఎన్నికలో ఆయన కుమారుడు డి.కె.సమరసింహారెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందినారు. సమరసింహారెడ్డి 4 సార్లు విజయం సాధించడం, రాష్ట్ర మంత్రివర్గంలో కూడా స్థానం పొందారు. సత్యారెడ్డి రెండో కుమారుడు డి.కె.భరత సింహారెడ్డి ఒకసారి (1994లో) ఎమ్మెల్యే విజయం సాధించారు. సత్యారెడ్డి కోడలు (భరత సింహారెడ్డి భార్య) 2004, 2009లలో గద్వాల నుంచి విజయం సాధించడమే కాకుండా ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్నారు. అంటే ఇప్పటివరకు గద్వాల నియోజకవర్గానికి జరిగిన 14 ఎన్నికలలో 8 సార్లు సత్యారెడ్డి కుటుంబీకులే గెలుపొందినారు.
విభాగాలు: జోగులాంబ గద్వాల జిల్లా ప్రముఖులు, గద్వాల మండలము, గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం, |
= = = = =
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి