1904లో మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో జన్మించిన కొత్త కేశవులు ప్రముఖ విమోచనోద్యమకారుడు మరియు రాజకీయ నాయకుడు. 1947లో జడ్చర్లలో జరిగిన ఆంధ్రమహాసభ రెసెప్షన్ కమిటీకి అధ్యక్షత వహించారు. 1947-48లో నిజాం వ్యతిరేక ఉద్యమంలోనూ చురుకుగా పాల్గొని అనేక సార్లు జైలుకు కూడా వెళ్ళారు. 1954లో జడ్చర్ల పురపాలక సంఘం చైర్మెన్ గా, జడ్చర్ల పంచాయతి సమితి అధ్యక్షులుగా పనిచేశారు. 1962లో జడ్చర్ల నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. జడ్చర్లలో అనేక విస్యాసంస్థలను నెలకొల్పి పట్టణంలో విద్యావ్యాప్తికి తోడ్పడ్డారు. 1973 ఆగస్టు 15న భారత ప్రభుత్వంచే స్వాతంత్ర్య సమరయోధులకిచ్చే తామ్రపత్రాన్ని స్వీకరించారు.
విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా సమరయోధులు, మహబూబ్‌నగర్ జిల్లా రాజకీయ నాయకులు, జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గం, జడ్చర్ల మండలము, |
= = = = =
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి