నందారం వెంకటయ్య కోడంగల్ ప్రాంతానికి చెందిన రాజకీయ నాయకుడు. ప్రారంభంలో వెంకటయ్య కోడంగల్ గ్రామపంచాయతికి 1964లో తొలి సర్పంచిగా పనిచేశారు. కోడంగల్ నియోజకవర్గం నుంచి 1972లో విజయం సాధించారు. 1983లో ఇండిపెండెంటుగా పోటీచేసి గురునాథ్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. 1985లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీచేసి గురునాథ్ రెడ్డిపైనే విజయం సాధించి రెండోసారి శాసనసభలో ప్రవేశించారు. 1994లో మళ్ళీ గురునాథ్ రెడ్డిపై గెలుపొంది మూడవసారి ఎమ్మెల్యే అయ్యారు. ఎమ్మెల్యేగా ఉంటూ మరణించడంతో 1996లో జరిగిన ఉప ఎన్నికలో నందారం సూర్యనారాయణ గెలుపొందినారు.
విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా రాజకీయనాయకులు, కోడంగల్ మండలము, కోడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం, |
= = = = =
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి