గద్వాల రైల్వేస్టేషన్ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రైల్వేస్టేషన్. ఇది దక్షిణమధ్య రైల్వే జోన్ లోని హైదరాబాదు డివిజన్ లో , సికింద్రాబాదు-డోన్ సెక్షనుపై ఉన్నది. ఈ స్టేషన్ సికింద్రాబాదు నుంచి దక్షిణంగా 188కిమీ, డోన్ నుంచి ఉత్తరంవైపుగా 110 కిమీ దూరంలో ఉన్నది. ఇది ఆరేపల్లి స్టేషన్ మరియు పూడూర్ రైల్వేస్టేషన్ల మధ్య ఉన్నది. గద్వాల నుంచి రాయచూరు వరకు నూతన రైలుమార్గం 2013, అక్టోబరు 12నాడు ప్రారంభమైంది. ఈ రైల్వేస్టేషన్ జిల్లాలోనే తొలి రైల్వేజంక్షన్ గా మారింది. మహబూబ్ నగర్ మరియు కర్నూల్ మధ్యలో ఇది పెద్ద స్టేషన్ కావడంతో దాదాపు అన్ని రైళ్ళు ఇక్కడ ఆగుతాయి. ఇక్కడ రెండు ప్లాట్ ఫాంలు, 3 లైన్లు ఉన్నాయి. స్టేషన్ నిర్మాణం పట్టణానికి 2 కిమీ దూరంలో సంస్థానాధీశులు ఇచ్చిన స్థలంలో నిర్మించబడింది. ప్రారంభంలో ఇది మీటరుగేజీగా ఉన్ననూ 1997లో గేజిమార్పుతో బ్రాడ్‌గేజీగా మార్చబడింది.
రైల్వేజంక్షన్: 2013, అక్టోబరు 12 నాడు గద్వాల నుంచి కర్ణాటకలోని రాయచూరు వరకు నూతనంగా నిర్మించిన 59 కిలోమీటర్ల రైలుమార్గం ప్రారంభం కావడంతో గద్వాల రైల్వేస్టేషన్ పాలమూరు జిల్లాలోనే తొలి రైల్వేజంక్షన్‌గా మారింది. ఈ జంక్షన్ వల్ల హైదరాబాదు నుంచి రాయచూరు వెళ్ళడానికి కాలయాపన తగ్గింది. ఇదివరకు రాయచూరు వెళ్ళే రైలుబండ్ళు వాడి నుంచి చుట్టూ తిరిగివెళ్ళేవి. 1999లో కేంద్ర రైల్వేశాఖ సహాయమంత్రి బండారు దత్తాత్రేయ చేతులమీదుగా శంకుస్థాపన చేసుకున్న జంక్షన్ పనులు 2013లో కేంద్ర రైల్వేశాఖ మంత్రి మల్లికార్జున్ చేతులమీదుగా ప్రారంభం జరిగింది. రైల్వే స్టేషన్ ఆధునికీకరణ: రైల్వేజంక్షన్ పనులు జరుగుతున్న కాలంలోనే రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులు చేపట్టారు. పురాతన సంస్థానానికి ప్రతీకగా రైల్వేస్టేషన్ భవన నిర్మాణం కూడా కోట ఆకారంలోనే, పర్యాటకలను ఆకట్టుకొనేవిధంగా నిర్మించారు. కోటబురుజులు ఆకారం మరియు గోడలపైన కోటనమూనా స్పష్టంగా కనిపించేటట్లు చేసి భవనం మొత్తాన్ని మట్టిరంగుతో తీర్చిదిద్దారు. సౌకర్యాలు: గద్వాల రైల్వేస్టేషన్‌లో కంప్యూటరైజ్డ్ రిజర్వేషన్ సౌకర్యం ఉంది. ప్రయాణీకులకోసం ఫుట్‌బ్రిడ్జి, మంచినీటిసౌకర్యం, కూర్చోడానికి బెంచీలు, అనౌన్స్‌మెంట్ సదుపాయం, స్టేషన్ బయట విశాలమైన పార్కింగ్ తదితరాలు ఉన్నాయి.
= = = = =
|
8, మార్చి 2013, శుక్రవారం
గద్వాల రైల్వేస్టేషన్ (Gadwal Railway Station)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి