వందేమాతరం రామచంద్రారావు పాలమూరు జిల్లాకు చెందిన ప్రముఖ సమరయోధులలో ఒకరు. 1917లో గద్వాలలో జన్మించిన రామచంద్రారావు అసలు ఇంటిపేరు వావిలాల. చిన్నతనంలోనే ఆర్యసమాజం వైపు ఆకర్షితులై విమోచనొద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. నిజాం పోలీసులు అరెస్టు చేసి ఎన్ని దెబ్బలు వేసిననూ దెబ్బదెబ్బకు వందేమాతరం అని నినదించడంతో సహచరులు ఇతన్ని వందేమాతరం అని పిలవడం చివరకు అదే ఇంటిపేరుగా మారడం జరిగింది. విమోచన అనంతరం 7 సం.లు శాసనసభ్యుడిగా పనిచేశారు. 1967లో అప్పడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న కొండావెంకట రంగారెడ్డిని ఓడించారు. ఆంధ్రప్రదేశ్ అధికార బాషా సంఘం అధ్యక్షునిగా కూడా పనిచేశారు.నల్గొండ జిల్లా మల్కాపురంలో వ్యవసాయదారుల సహకార సంఘాన్ని నెలకొల్పినారు. "వీర సావర్కార్" గ్రంథాన్ని రచించినారు. నవంబరు 28, 2001న రాంచంద్రారావు మరణించారు. ప్రముఖ విమోచనోద్యమకారుడు, రాజకీయ నాయకుడైన మందుముల నరసింగరావు ఈయన సొదరుడు.
విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా రాజకీయ నాయకులు, మహబూబ్‌నగర్ జిల్లా సమరయోధులు, గద్వాల మండలము, |
- ఆంగ్ల వికీపీడియా,
- గోలకొండ పత్రిక సంచికలు,
- ఆంధ్రప్రదేశ్ (మాసపత్రిక) సంచికలు,
- స్వాతంత్ర్య సమరంలో తెలంగాణ ఆనిముత్యాలు (రచన- మల్లయ్య),
- పాలమూరు ఆధునిక యుగ కవుల చరిత్ర (రచన- ఆచార్య ఎస్వీ రామారావు),
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి