26, ఏప్రిల్ 2013, శుక్రవారం

బోయపల్లి (Boyapalli)

బోయపల్లి గ్రామము
గ్రామముబోయపల్లి
మండలముమహబూబ్‌నగర్
జిల్లామహబూబ్‌నగర్
జనాభా8036
బోయపల్లి మహబూబ్‌నగర్ జిల్లా మహబూబ్‌నగర్ మండలమునకు చెందిన గ్రామము. 2001 లెక్కల ప్రకారము గ్రామ జనాభా 8036. ఈ గ్రామము మహబూబ్‌నగర్ పట్టణం నుచి 4 కిమీ దూరంలో ఉంది. మహబూబ్‌నగర్ నుంచి నవాబ్‌పేట వెళ్ళు రహదారి గ్రామం మీదుగా వెళుతుంది. ఇది పూర్వం గ్రామపంచాయతీగా ఉండేది. 2011లో ఈ గ్రామాన్ని మహబూబ్‌నగర్ పురపాలక సంఘంలో విలీనం చేశారు.

భౌగోళికం, సరిహద్దులు:
బోయపల్లి గ్రామం భౌగోళికంగా మహబూబ్‌నగర్ మండలంలో ఉత్తరం వైపు ఉంది. ఈ గ్రామానికి ఉత్తరాన జమిస్తాపూర్, దక్షిణాన మహబూబ్‌నగర్ పట్టణం, తూర్పున ఎరవల్లి గ్రామాలుండగా పశ్చిమాన హన్వాడ మండలము, ఉత్తరాన కొంతవరకు నవాబ్‌పేట మండలము సరిహద్దులుగాఉన్నాయి.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 8036. ఇందులో పురుషులు 4029, మహిళలు 4007. 2001 నాటికి ఇది జనాభాలో మండలంలో ప్రథమస్థానంలో ఉంది.

రవాణా సౌకర్యాలు:
ఈ గ్రామం మహబూబ్‌నగర్ నుంచి నవాబ్‌పేట వెళ్ళు మార్గములో ఉంది. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉండుట మరియు నవాబ్‌పేట రహదారిపై ఉండుటచే బస్సులు, ప్రైవేటు వాహనాల వల్ల రవాణావసతులు బాగుగా ఉన్నాయి. మహబూబ్‌నగర్ పట్టణంలో కొత్తగంజ్ వద్ద నవాబ్‌పేట వెళ్ళు మార్గంలో ఉన్న రైల్వేగేటును బోయపల్లి రైల్వేగేటుగా పిలుస్తారు.

విభాగాలు: మహబూబ్‌నగర్ మండలములోని గ్రామాలు,  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక