కోడంగల్ మండల కేంద్రంలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం ఉంది. ఏటా ఫాల్గుణ మాసంలో వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. సుమారు నాలుగు దశాబ్దాల క్రితం నందారం నర్సిములు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయ విగ్రహాన్ని అప్పటి తిరుమల ప్రధాన అర్చకులు మీరాశిదార్ వెంకటరమణ దీక్షితులుచే ప్రతిష్టించబడింది. ఆలయ సమీపంలో పుష్కరిణి, కళ్యాణమండపం ఉన్నాయి.
ఈ ఆలయానికి తిరుమల ఆలయానికి సంబంధమున్నట్లు చెబుతారు. ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన సమయంలో తిరుమల ఆలయం గంతసేపు అనివార్య కారణాలతో మూతపడింది. ఏడుకొండలస్వామి ఆ సమయంలో ఇక్కడికి వచ్చినట్లు చెబుతుంటారు. ఏటా బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమల నుంచి వచ్చిన వస్త్రంతోనే అలంకరణ జరుగుతుంది. ఇక్కడ ప్రధాన అర్చకులుగా పనిచేసిన సుందర వరదాచార్యులవారు తిరుమల ప్రధాన అర్చకులుగా పనిచేశారు.
నియోజకవర్గంలోనే ఇది పేరుగాంచిన ఆలయం. ప్రస్తుతం ఇది దేవాదాయశాఖ అధీనంలో ఉంది. ఏటా బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు.

విభాగాలు: పాలమూరు జిల్లా దేవాలయాలు, కోడంగల్ మండలము, |
= = = = =
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి