23, ఏప్రిల్ 2013, మంగళవారం

నాయినోనిపల్లి (Nayinonipalli)

నాయినోనిపల్లి గ్రామము
గ్రామమునాయినోనిపల్లి
మండలముహన్వాడ
జిల్లామహబూబ్‌నగర్
జనాభా1376 (2001),
1575 (2011),
గ్రామ కోడ్ సంఖ్య575063
నాయినోనిపల్లి మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతికేంద్రము. 2001 లెక్కల ప్రకారము గ్రామ జనాభా 1376. ఈ గ్రామము మహబూబ్‌నగర్ నుంచి 13 కిమీ దూరంలో ఉంది.

భౌగోళికం, సరిహద్దులు:
నాయినోనిపల్లి గ్రామం భౌగోళికంగా మండలంలో మధ్యలో ఉన్నది. ఈ గ్రామానికి దక్షిణమున మరియు తూర్పున హన్వాడ, పశ్చిమాన అమ్మాపూర్, ఉత్తరమున ఇబ్రహీంబాద్ గ్రామాలు సరిహద్దులుగాఉన్నాయి.

రవాణా సౌకర్యాలు:
మహబూబ్‌నగర్ నుంచి కోస్గి వెళ్ళు ప్రధాన రహదారి గ్రామం మీదుగా వెళ్ళుచున్నది. తాండూరు, పరిగి వెళ్ళు ఆర్టీసి బస్సులే కాకుండా ప్రైవేటు వాహనాలు కూడా అందుబాటులో ఉన్నాయి.

జనాభా:
2001 జనాభా లెక్కల ప్రకారము గ్రామ జనాభా 1376. ఇందులో పురుషులు 689, మహిళలు 687.
2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1575. ఇందులో పురుషులు 798, మహిళలు 777. గృహాల సంఖ్య 337, అక్షరాస్యత శాతం 40.4%. గ్రామ కోడ్ సంఖ్య 575063.

రాజకీయాలు:
2009 శాసనసభ ఎన్నికలలో ఈ గ్రామం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థి రాజేశ్వర్ రెడ్డికి 5 ఓట్ల మెజారిటి లభించింది. రాజేశ్వర్ రెడ్డికి 226, తెరాస అభ్యర్థి ఇబ్రహీంకు 221, కాంగ్రెస్ అభ్యర్థి పులివీరన్నకు 105, ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థికి 113 ఓట్లు లభించాయి.

విద్యాసంస్థలు:
గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఉంది.  నాయినోనిపల్లిలో మరియు చెంచుపెంటలో ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాలలున్నాయి.
విభాగాలు: హన్వాడ మండలములోని గ్రామాలు,  


సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Census Statistics, Mahabubnagar Dist 2001,
  • Census Statistics, Mahabubnagar Dist, 2011,
  • బ్లాగురచయిత పర్యటించి తెలుసుకున్న, సేకరించిన విషయాలు,  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక