పానగల్ కోట పురాతనమైనది. క్రీ.శ.11-12 శతాబ్దికి చెందిన ఈ కోటను చాళుక్యులు నిర్మించినట్లు ఆధారాలున్నాయి. ఈ ఖిల్లా 1800 అడుగుల ఎత్తున, 5 చదరపు మైళ్ళ వైశాల్యంతో విస్తరించియుంది. దీనికి 60 బురుజులు, సప్తప్రాకారాలుండేవని చరిత్ర తెలుపుతున్ననూ ప్రస్తుతం చాలా వరకు శిథిలమైంది. ప్రధాన ముఖద్వారం ముండ్లగవిని ఇప్పటికీ చెక్కుచెదరలేదు. ప్రధానద్వారం వద్దనే తెలుగు, కన్నడ భాషలలో ఉన్న శాసనం లభ్యమైంది. 18వ శతాబ్దిలో నిజాం వంశీయుడైన నిజాం అలీఖాన్ బహదుర్ ఈ కోతలో కొంతకాలం నివశించినట్లు చెబుతారు. ఖిల్లాలోని రామగుండంలో నీరు ఎల్లప్పుడూ ఒకే స్థాయిలో ఉండుట విశేషం. రామగుండం సమీపంలో ఉన్న గుడిలో పాదముద్రలు సీతారామునివని భక్తుల విశ్వాసం.
విభాగాలు: పాలమూరు జిల్లా కోటలు, పానగల్ మండలము, |
= = = = =
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి