బోడ జనార్థన్
| |
జననం | |
జిల్లా | ఆదిలాబాదు |
పదవులు | రాష్ట్ర మంత్రి, 4 సార్లు ఎమ్మెల్యే, |
నియోజకవర్గం | చెన్నూర్ |
బోడ జనార్థన్ ఆదిలాబాదు జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. చెన్నూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి 4 సార్లు గెలుపొందిన బోడ జనార్థన్ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి పదవిని కూడా పొందినారు. 1985లో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కె.దేవకి దేవిపై విజయం సాధించి శాసనసభలో అడుగుపెట్టగా, 1989లో కోదాటి ప్రదీప్‌పై నెగ్గి అప్పటి ఎన్.టి.రామారావు మంత్రివర్గంలో కార్మిక శాఖా మంత్రిపదవిని పొందినారు. 1994 శాసనసభ ఎన్నికలలో కూడా ఇదే నియోజకవర్గం నుండి సంజీవరావుపై భారీ మెజారిటీతో గెలిచి హాట్రిక్ సాధించారు. 1999లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జి.వెంకటస్వామి కుమారుడైన జి.వినోద్‌పై నెగ్గినారు. 2004లో మాత్రం జి.వినోద్ చేతిలో పరాజయం పొందినారు.
విభాగాలు: ఆదిలాబాదు జిల్లా రాజకీయ నాయకులు, చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం, రాష్ట్ర మంత్రులు, |
= = = = =
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి