దేపల్లి గ్రామము
| |
గ్రామము | దేపల్లి |
మండలము | నవాబ్‌పేట |
జిల్లా | మహబూబ్‌నగర్ |
జనాభా | 976 (2001) |
దేపల్లి మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలమునకు చెందిన గ్రామము. గ్రామ విస్తీర్ణము 530 హెక్టార్లు. ఇది పంచాయతి కేంద్రము. మండల వ్యవస్థకు ముందు ఈ గ్రామం షాద్‌నగర్ తాలుకాలో భాగంగా ఉండేది.
అక్టోబరు 2021లో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన అద్దుల వెంకటేశ్వర్ రెడ్డి ఈ మండలమునకు చెందినవారు
భౌగోళికం, సరిహద్దులు:
భౌగోళికంగా ఈ గ్రామం మండలంలో ఉత్తరం వైపున కొందుర్గ్, షాద్‌నగర్, బాలానగర్ మండలాల సరిహద్దులో ఉన్నది. ఈ గ్రామానికి దక్షిణాన చౌడూర్, కాకర్జాల గ్రామాలు, పశ్చిమాన కొల్లూర్ గ్రామం సరిహద్దుగా ఉండగా, ఉత్తరాన కొందుర్గ్ మండలం, తూర్పున షాద్‌నగర్ మరియు బాలానగర్ మండలాలు సరిహద్దులుగా ఉన్నాయి.
జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 976. ఇందులో పురుషులు 491, మహిళలు 485. గృహాల సంఖ్య 169.
రాజకీయాలు:
2013, జూలై 27న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా కె.శ్రీలత ఎన్నికయ్యారు.
విభాగాలు: నవాబ్‌పేట మండలంలోని గ్రామాలు, |
= = = = =
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి