డీఎల్ రవీంద్రారెడ్డి
| |
జననం | డిసెంబరు 7, 1950 |
పదవులు | రాష్ట్ర మంత్రి |
నియోజకవర్గం | మైదుకూరు |
డీఎల్ రవీంద్రారెడ్డి కడప జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. డిసెంబరు 7, 1950న జన్మించిన రవీంద్రారెడ్డి ఎంబీబీఎస్ అభ్యసించారు. 1978లో రాజకీయాలలో ప్రవేశించి ఇండిపెండెంటుగా పోటీచేసి విజయం సాధించారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1983లో తెలుగుదేశం పార్టీ ప్రభంజనంలోనూ గెలుపొందినారు. 1985, 1994లలో ఓటమి చెందిననూ 1989, 1999, 2004, 2009లలో విజయం సాధించి మొత్తం 6 సార్లు కడప జిల్లా మైదుకూరు నుంచి ఎమ్మెల్యే అయ్యరు. 1991-94కాలంలో నేదురుమల్లి జనార్థన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంత్రివర్గాలలో పనిచేశారు. 20 సంవత్సరాల అనంతరం 2010లో కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో మళ్ళీ స్థానం లభించింది. 2011లో కడప లోకసభ స్థానానికి వైఎస్ జగన్ పై పోటీచేసి ఘోరపరాజయం పొందారు. జూన్ 1, 2013న మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయ్యారు.
విభాగాలు: కడప జిల్లా ప్రముఖులు, ఆంధ్రప్రదేశ్ 13వ శాసనసభ మంత్రులు, 13వ శాసనసభ సభ్యులు, |
= = = = =
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి