21, జూన్ 2013, శుక్రవారం

ఎల్.వి.ప్రసాద్ (L.V.Prasad)

 ఎల్.వి.ప్రసాద్
(1908-1994)
జననంజనవరి 17,1908
రంగంసినీనిర్మాత, దర్శకుడు, నటుడు,
అవార్డులురఘుపతి వెంకయ్య అవార్డు (1980), దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు (1982)
మరణం22 జూన్,1994
తెలుగు సినీనిర్మాతగా, దర్శకుడిగా, నటుడిగా ప్రసిద్ధి చెందిన ఎల్.వి.ప్రసాద్ పశ్చిమ గోదావరి జిల్లా సోమవరప్పాడు గ్రామంలో జనవరి 17,1908న జన్మించారు. ఎల్.వి.ప్రసాద్ గా పరిచితుడైన ఇతని పూర్తిపేరు అక్కినేని లక్ష్మీవరప్రసాదరావు.

ఎల్వీ ప్రసాద్ హిందీ, తమిళ, తెలుగు, కన్నడ వంటి పలు భారతీయ భాషలలో దర్శకత్వం, నిర్మాతగా, నటుడిగా 50 చిత్రాల వరకు చేశారు. హిందీ, తమిళ, తెలుగు భాషలలో తొలి టాకీ చిత్రాలయిన ఆలం ఆరా, కాళిదాస్ మరియూ భక్తప్రహ్లాద మూడింటిలోనూ ఆయన నటించడం విశేషంగా చెప్పవచ్చు. గృహప్రవేశం సినిమాతో దర్శకత్వం ప్రారంభించారు. ఈ చిత్రంలో భానుమతి సరసన హీరోగా నటించారు. 1950లో నాగిరెడ్డి, చక్రపాణిలు స్థాపించిన "విజయా సంస్థ" నిర్మించిన తొలిచిత్రం షావుకారుకు కూడా ప్రసాద్ దర్శకత్వం వహించారు. ఇతను దర్శకత్వం వహించిన మిస్సమ్మ, గృహప్రవేశం, షావుకారు, అప్పుచేసి పప్పుకూడు, పెళ్ళిచేసి చూడు లాంటి జనాదరణ పొందాయి. 1980లో 27వ నేషనల్ ఫిలిం అవార్డుల సెలెక్షన్ కమిటీకి చైర్మెన్‌గా వ్యవహరించారు.

ఆయన సినీరంగానికి చేసిన సేవలకు గాను భారత తపాలాశాఖ 2006లో ఆయన ముఖచిత్రంతో తపాలాబిళ్ళ విడుదల చేసింది. "ది క్లయింట్" లఘుచిత్రానికి 1970లో చికాగో ఫిలిం ఫెస్టివల్‌లో అవార్డు పొందారు. 1978-79లో తమిళనాడు ప్రభుత్వం నుంచి రాజాశాండో మెమోరియల్ అవార్డు, 1980లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి తొలి రఘుపతి వెంకయ్య అవార్డు స్వీకరించారు. 1982లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొంది ఈ ఘనత పొందిన మూడవ తెలుగు వ్యక్తిగా కీర్తి పొందారు. 22 జూన్,1994న మరణించారు. ఆయన కుమారుడు రమేష్ ప్రసాద్ తండ్రి పేరిట హైదరాబాదులో ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిని, ప్రసాద్ ఐమాక్స్ థియేటర్, స్థాపించారు.

ఇవి కూడా చూడండి:

విభాగాలు: పశ్చిమ గోదావరి జిల్లా వ్యక్తులు, తెలుగు సినిమా నటులు, తెలుగు సినిమా దర్శకులు, తెలుగు సినిమా నిర్మాతలు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతలు, రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీతలు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక