22, జూన్ 2013, శనివారం

మాకినేని పెదరత్తయ్య (Makineni Peda Ratthaiah)

 మాకినేని పెదరత్తయ్య
జననంఅబ్బినేనిగుంటపాలెం
జిల్లాగుంటూరు
పదవులు6 సార్లు ఎమ్మెల్యే, రాష్ట్రమంత్రి, తెదేపా జిల్లా అధ్యక్షుడు,


మాకినేని పెదరత్తయ్య గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అబ్బినేనిగుంటపాలెం గ్రామానికి చెందినవారు. ఇతను గుంటూరు జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. ఎన్టీరామారావు ఆహ్వానం మేరకు తెలుగుదేశం పార్టీలో చేరి 1983 నుంచి వరసగా 5 సార్లు తెదేపా తరఫున పత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. 1989 నుంచి 1994వరకు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. 1994లో ఎన్టీయార్ మంత్రివర్గంలో స్థానం పొందారు. 1994లో జరిగిన తెదేపా సంక్షోభం సమయంలో మాకినేని ఎన్టీయార్ వైపు ఉన్నారు. 1996లో లక్ష్మీపార్వతి ఏర్పాటుచేసిన పార్టీ తరఫున గుంటూరు నుంచి లోకసభకు పోటీచేశారు. తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరారు. 1999లో తెదేపా తరఫున పోటీచేసి విజయం సాధించారు. కొంతకాలం పార్టీ జిల్లా అధ్యక్షులుగానూ ఉన్నారు. 2004లో మొదటిసారి శాసనసభ ఎన్నికలలో ఓటమిచెందారు. 2009లో పత్తిపాడు ఎస్సీలకు కేటాయించడంతో పోటీచేయలేరు. రాజ్యసభ సీటుకు ఆశించిననూ టికెట్ రాలేదు. తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైకాపా నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.

విభాగాలు: గుంటూరు జిల్లా రాజకీయ నాయకులు, పెదనందిపాడు మండలం,  పత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం, రాష్ట్ర మంత్రులు,


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక