22, జూన్ 2013, శనివారం

యలవర్తి నాయుడమ్మ (Yelavarthy Nayudamma)

యలవర్తి నాయుడమ్మ
జననంసెప్టెంబరు 10, 1922
స్వస్థలంయలవర్రు (గుంటూరు జిల్లా)
రంగంశాస్రవేత్త
మరణంజూన్ 23, 1985
యలవర్తి నాయుడమ్మ సెప్టెంబరు 10, 1922న గుంటూరు జిల్లా యలవర్రు గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుంచి బిఎస్సీ పూర్తిచేసి మద్రాసులోని లెదర్ టెక్నాలజీ సంస్థలో చేరారు. ఈయన ప్రతిభను గమనించి మద్రాసు ప్రభుత్వం చర్మ పరిశోధనలకై అమెరికా పంపించగా, అక్కడ పరిశోధనలు పూర్తిచేసి చర్మశుద్ధి అంశంపై పీహెడ్ డాక్టరేట్ పొందారు.

భారత్ తిరిగివచ్చిన పిదప సెంట్రల్ లెదర్ రీసెర్చిసంస్థలో శాస్త్రవేత్తగా చేరి, పరిశోధనలతో క్రమక్రమంగా సంస్థను అభివృద్ధి పరుస్తూ, తాను ఆ సంస్థకు డైరెక్టర్ అయ్యారు. జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి వైస్-ఛాన్సలర్‌గానూ పనిచేశారు. జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఈయన రాష్ట్ర ప్రభుత్వ గౌరవ సలహాదారుగా నియమించబడ్డారు. తమిళనాడు ప్రభుత్వానికి కూడా గౌరవ సలహాదారునిగా పనిచేశారు.

ఈయన తన ప్రతిభతో దేశవిదేశాలలో అనేక సంస్థలలో సభ్యత్వం గౌరవ పొందారు. వడోదర విశ్వవిద్యాలయం నుంచి స్వర్ణపతకాన్ని స్వీకరించారు. 1971లో కేంద్రప్రభుత్వంచే "పద్మశ్రీ" పురస్కారాన్ని పొందారు. పరిశోధనల ద్వారా రాష్ట్రానికి, దేశానికి పేరుతెచ్చిన నాయుడమ్మ జూన్ 23, 1985న కనిష్క విమాన ప్రమాదంలో మరణించారు.
యలవర్తి నాయుడమ్మ జనరల్ నాలెడ్జి

యలవర్తి నాయుడమ్మ ఒక తెలుగు సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఎన్.టి.రామారావు హీరోగా, ఎన్.డి.లాల్ దర్శకత్వంలో రాజపుత్ర రహస్యం సినిమాను నిర్మించారు. నాయుడమ్మ శాస్త్రవేత్త కావడంతో ఈ జానపద చిత్రం లో కూడా ఓ వైజ్ఞానిక విషయాన్ని ప్రస్తావించారు. ఓ మనిషి ఏ ప్రాంతంలో పెరిగితే ఆ భాషనే మాట్లాడతాడు. అనే సిద్ధాంతాన్న్ని అనుసరించి ఇందులో హీరో చిన్న తనంలోనే అడవిలో జంతువుల సహవాసంలో పెరగడంతో కేవలం సైగలే చేస్తూ ఉంటాడు.

1986లో నాయుడమ్మ స్మారకార్థం ఆయన పేరిట "నాయుడమ్మ అవార్డు" స్థాపించారు. శాస్త్ర,సాంకేతిక రంగాలలో కృషిసల్పిన వారికి ఈ అవార్డు ప్రధానం చేస్తున్నారు.



విభాగాలు: ఆంధ్రప్రదేశ్ శాస్త్రవేత్తలు, గుంటూరు జిల్లా వ్యక్తులు, 1922లో జన్మించినవారు, 1985లో మరణించినవారు, 


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక