6, ఆగస్టు 2013, మంగళవారం

కొత్తపల్లి జయశంకర్ (Kothapalli Jayashankar)

 కొత్తపల్లి జయశంకర్
జననంఆగస్టు 6, 1934
స్వస్థలంఅక్కంపేట (వరంగల్‌ జిల్లా)
పదవులుకాకతీయ విశ్వవిద్యాలయం విసి,
మరణంజూన్21, 2011
తెలంగాణ సిద్ధాంతకర్తగా పేరుపొందిన కొత్తపల్లి జయశంకర్ ఆగస్టు 6, 1934న వరంగల్‌ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేటలో జన్మించారు. బనారస్‌, అలీగఢ్‌ విశ్వవిద్యాలయాలనుంచి ఆర్థికశాస్త్రంలో పట్టా అందుకున్న జయశంకర్‌ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేశారు. 1975 నుంచి 1979 వరకు వరంగల్‌ సీకేఎం ప్రిన్సిపాల్‌గా, 1979 నుంచి 1981 వరకు కేయూ రిజిస్ట్రార్‌గా, 1982 నుంచి 1991 వరకు సీఫెల్‌ రిజిస్ట్రార్‌గా, 1991 నుంచి 1994 వరకు కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసి ఆజన్మ బ్రహ్మచారి గా మిగిలిపోయారు. తెలంగాణ సిద్ధాంతకర్తగా పేరుపొందడమే కాకుండా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై అవతరించిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి సిద్ధాంతరూపం ఇచ్చిన ప్రముఖుడిగా జయశంకర్ పేరుపొందారు. తెలంగాణపై పలు గ్రంథాలు రచించడమే కాకుండా తెలంగాణ వెనకబాటుకు సిద్ధాంతపరంగా పరిశొధనలు చేసి ఎత్తిచూపారు. జూన్21, 2011న జయశంకర్ మరణించారు.

తెలంగాణ ఉద్యమంలో:
1969 తెలంగాణా ఉద్యమంలో జయశంకర్ చురుగ్గా పాల్గొన్నారు. 1952 లో జయశంకర్ నాన్ ముల్కీ ఉద్యమంలో, సాంబార్, ఇడ్లీ గోబ్యాక్ ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థి నాయకుడిగా ఆయన 1954 లో ఫజల్ అలీ కమిషన్‌కు నివేదిక ఇచ్చారు. కె.సి.ఆర్.కు సలహాదారుగా, మార్గదర్శిగా తోడ్పాటు అందించారు. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై ఆయన పలు పుస్తకాలు రచించారు. తెలంగాణలోనే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాల్లో, విదేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత గురించి ప్రసంగాలు చేశారు. జయశంకర్ తన ఆస్తిని, జీవితాన్ని తెలంగాణ కోసం అంకితం చేశాడు. "నాకు ఒకే ఒక కోరిక మిగిలింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కళ్ళారా చూడాలి, తర్వాత మరణించాలి" అని అనేవారు.

విభాగాలు: వరంగల్ జిల్లా ప్రముఖులు, ఆత్మకూరు మండలం, కాకతీయ విశ్వవిద్యాలయం, 1934లో జన్మించినవారు, 2011లో మరణించినవారు,


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక