నంది తిమ్మన
| |
నంది తిమ్మన శ్రీకృష్ణదేవరాయల అష్టదిగ్గజాలలో ఒకడు. ఇతను రాయల భార్య తిరుమల దేవికి అరణంగా విజయనగరం వచ్చిన కవి. ఈయన అనంతపురం పరిసర ప్రాంతానికి చెందిన వాడని భావిస్తున్నారు. ఈయన నివసించిన రాజ్యం, విజయనగర సామ్రాజ్యానికి సామంత రాజ్యంగా ఉండేది. ఆ సామంత రాజ్యపు యువరాణి తిరుమలాదేవి ఆ తరువాత కృష్ణదేవరాయల ధర్మపత్ని అయ్యింది. ఈయన తాత నంది మల్లయ్య మరియు మేనమామ ఘంట సింగన్న (ఈయనకే మలయమారుత కవి అనికూడా మరోపేరు) కృష్ణదేవరాయల తండ్రి అయిన వీరనరసింహరాయల ఆస్థానంలో జంటకవులుగా ఉండేవారు. నంది తిమ్మనను ముక్కు తిమ్మన అని కూడా అంటారు.
ఇవి కూడా చూడండి:
ఇవి కూడా చూడండి:
- శ్రీకృష్ణదేవరాయలు,
- తెలుగు సాహితీవేత్తలు,
విభాగాలు: తెలుగు కవులు, అష్టదిగ్గజ కవులు |
= = = = =
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి