పాలమూరు పట్టణంలోని వీరన్నపేటలో 600 సంవత్సరాల క్రితం నాటి నుంచి పూజలందుకుంటున్న రామలింగేశ్వరస్వామి ఆలయమే పాతపాలమూరు శివాలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం కాకతీయుల కాలంలో నిర్మితమైంది. గర్భగుడిలోపల పై భాగంలో నాగబంధం ఉండుట ఈ ఆలయం ప్రత్యేకత. అలాగే గర్భగుడిపై గోపురం లేదు. ఈ ఆలయంలో పూజలు నిర్వహిస్తే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. మహాశివరాత్రి లాంటి పర్వదినాలలో భక్తులతో ఆలయం కిటకిటలాడుతుంది.
విభాగాలు: పాలమూరు జిల్లా దేవాలయాలు, మహబూబ్‌నగర్ పట్టణం, |
= = = = =
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి