తెనాలి రామకృష్ణుడు
| |
జననం | 1514 |
స్వస్థలం | తెనాలి |
రచనలు | పాండురంగ మహాత్మ్యము, |
మరణం | 1575 |
తెనాలి రామకృష్ణుడు శ్రీ కృష్ణదేవరాయలు ఆస్థానములోని కవి పండితులలో ఒకడు. ఈయనని తెనాలి రామలింగ కవి అని కూడా అంటారు. ఇతను గొప్ప కావ్యాలు విరచించారు. కానీ తెలుగు వారికి ఆయన ఎక్కువగా హాస్య కవిగానే పరిచయం. ఆయనకు వికటకవి అని బిరుదు కలదు. ఆయనపై ఎన్నో కథలు ఆంధ్ర దేశమంతా ప్రాచుర్యములో కలవు. మొదట్లో రామకృష్ణుడి ఇంటి పేరు గార్లపాటి అని, తెనాలి నుండి వచ్చినారు కనుక తరువాతి కాలంలో తెనాలి అయినది అని ఒక నానుడి. సత్తెనపల్లి మండలంలోని లక్కరాజుగార్లపాడు గ్రామానికి చెందిన గార్లపాటి రామయ్య, లక్ష్మాంబల సంతానం రామలింగయ్య. రామకృష్ణుడి స్వస్థలం తెనాలి. ఇదే గ్రామాన్ని ఆయన అగ్రహారంగా పొందినాడు. రామలింగయ్య తాత,ముత్తాతలు గార్లపాడు లోనే నివసించారు. క్రీ.శ. 1514 నుంచి 1575 వరకు రామలింగయ్య జీవించారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించడంతో మేనమామ తెనాలి అగ్రహారమైన తూములూరుకు తీసుకువెళ్లారు. అక్కడే వారి సంరక్షణలో విద్యాబుద్ధులు నేర్చుకున్నారు.
రచనలు
పాండురంగ మహాత్మ్యము, ఉద్భటారాధ్య చరిత్ర, ఘటికాచల మహాత్మ్యము,
ఇవి కూడా చూడండి:
రచనలు
పాండురంగ మహాత్మ్యము, ఉద్భటారాధ్య చరిత్ర, ఘటికాచల మహాత్మ్యము,
ఇవి కూడా చూడండి:
- శ్రీకృష్ణదేవరాయలు,
- తెలుగు సాహితీవేత్తలు,
విభాగాలు: తెలుగు కవులు, అష్టదిగ్గజ కవులు, |
= = = = =
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి