ఎం.సత్యనారాయణరావు
| |
జననం | జనవరి 14, 1934 |
జిల్లా | కరీంనగర్ జిల్లా |
పదవులు | 3 సార్లు ఎంపి, డిసిసి అధ్యక్షుడు, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి, |
నియోజకవర్గం | కరీంనగర్ లో/ని, |
ఎం.సత్యనారాయణరావు కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు. ఈయన జనవరి 14, 1934న జన్మించారు. 1954లో కాంగ్రెస్ పార్టీలో చేరి, 1959లో యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అయ్యారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడిగా పనిచేశారు. 1969 తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని, తెలంగాణ ప్రజాసమితి పార్టీలో చేరి ఆ పార్టీ తరఫున 1971లో కరీంనగర్ లోకసభ నియోజకవర్గం నుంచి పోటీచేసి విజయం సాధించారు. ఆ తర్వాత 1977, 1980లలో కూడా కరీంనగర్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించి, 3 వరస విజయాలతో హాట్రిక్ సాధించారు. ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు.
విభాగాలు: కరీంనగర్ జిల్లా రాజకీయ నాయకులు, కరీంనగర్ జిల్లా డిసిసి అధ్యక్షులు, కరీంనగర్ లోకసభ నియోజకవర్గం, 5వ లోకసభ సభ్యులు, 6వ లోకసభ సభ్యులు, 7వ లోకసభ సభ్యులు, 1934లో జన్మించినవారు, |
= = = = =
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి