15, డిసెంబర్ 2013, ఆదివారం

ఇల్లెందు అసెంబ్లీ నియోజకవర్గం (Illendu Assembly Constituency)

ఇల్లెందు అసెంబ్లీ నియోజకవర్గం ఖమ్మం జిల్లాలోని 10 శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. 2009 నాటి నియోజకవర్గాల పునర్విభజన ప్రకారం ఈ నియోజకవర్గంలో 4 మండలాలున్నాయి. ఈ సెగ్మెంట్ మహబూబాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. ఇది ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది.

నియోజకవర్గ పరిధిలోని మండలాలు:
2009 నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఈ నియోజకవర్గం పరిధిలో 4 మండలాలు కలవు.
  • ఇల్లందు
  • బయ్యారం
  • గార్ల
  • సింగరేణి
నియోజకవర్గ చరిత్ర:ఇక్కడి నుంచి సీపీఐఎంఎల్ (న్యూ డెమొక్రసి) పార్టీ అత్యధికంగా 6 సార్లు విజయం సాధించగా అందులో 5 సార్లు ఆ పార్టి తరఫున గుమ్మడి నరసయ్య విజయం సాధించారు. 2009లో తెలుగుదేశం పార్టీ తొలిసారి విజయం సాధించగా, 2014లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందినది. కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించిన కోరం కనకయ్య ఆ పిదప తెరాసలో చేరారు.

సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1999 గుమ్మడి నరసయ్య న్యూడెమొక్రసి

2004 గుమ్మడి నరసయ్య ఇండిపెండెంట్

2009 ఊకె అబ్బయ్య తెలుగుదేశం పార్టీ గుమ్మడి నరసయ్య సీపిఐఎంఎల్
2014 కోరం కనకయ్య కాంగ్రెస్ పార్టీ హరిప్రియ తెలుగుదేశం పార్టీ
2018 హరిప్రియ కాంగ్రెస్ పార్టీ కోరం కనకయ్య తెరాస



2009 ఎన్నికలు:
2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఊకె అబ్బయ్య తన సమీప ప్రత్యర్థి, సీపీఐఎంఎల్ అభ్యర్థి, సిటింగ్ ఎమ్మెల్యే అయిన గుమ్మడి నరసయ్యపై 2946 ఓట్ల మెజారిటితో విజయం సాధించారు.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన కోరం కనకయ్య తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీకి చెందిన హరిప్రియపై 11507 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించారు. 2014, సెప్టెంబరు 1న కోరం కనకయ్య తెరాసలో చేరారు.

2018 ఎన్నికలు:
2018 ఎన్నికలలో తెరాస తరఫున కోరం కనకయ్య, భాజపా తరఫున మోకాళ్ల నాగస్రవంతి, ప్రజాకూటమి తరఫున కాంగ్రెస్ పార్టీకి చెందిన బానోర్ హరిప్రియనాయక్ పోటీచేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన హరిప్రియ బానోత్ తన సమీప ప్రత్యర్థి, తెరాసకు చెందిన కోరం కనకయ్య పై 2887 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.


విభాగాలు: ఖమ్మం జిల్లా నియోజకవర్గాలు, మహబూబాబాదు లోకసభ నియోజకవర్గం, ఇల్లెందు అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక