భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. 2009 నాటి నియోజకవర్గాల పునర్విభజన ప్రకారం ఈ నియోజవర్గంలో 8 మండలాలున్నాయి. ఈ సెగ్మెంట్ మహబూబాదు లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది.
నియోజకవర్గ పరిధిలోని మండలాలు:
2009 నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఈ నియోజకవర్గం పరిధిలో 8 మండలాలు కలవు.
2004 ఎన్నికలు:2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో సి.పి.ఎం పార్టి అభ్యర్థి సున్నం రాజయ్య తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన సోడె రామయ్యపై 14585 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందినారు. సున్నం రాజయ్యకు 64888 ఓట్లు రాగా, సోడె రామయ్యకు 50303 ఓట్లు లభించాయి.
2009 ఎన్నికలు:
2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ కుంజా సత్యవతి తన సమీప ప్రత్యర్థి సి.పి.ఎం.అభ్యర్థి, సిటింగ్ ఎమ్మెల్యే అయిన సున్నం రాజయ్యపై 6956 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఈ ఎన్నికలలో మొత్తం 9 అభ్యర్థులు పోటీచేయగా కుంజా సత్యవతి 51293 ఓట్లు సాధించింది. సున్నం రాజయ్యకు 44940 ఓట్లు లభించాయి. ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి గుండు శరత్ 28199 ఓట్లు పొందారు.
2014 ఎన్నికలు: 2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి సీపీఎం పార్టీకి చెందిన సున్నం రాజయ్య తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీకి చెందిన ఫణీశ్వరమ్మపై 1815 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. 2018 ఎన్నికలు: 2018 ఎన్నికలలో తెరాస తరఫున తెల్లం వెంకట్రావు, భాజపా తరఫున కుంజా సత్యవతి, ప్రజాకూటమి తరఫున కాంగ్రెస్ పార్టీకి చెందిన పొదెం వీరయ్య పోటీచేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందినపూడెం వీరయ్య తన సమీప ప్రత్యర్థి, తెరాసకు తెల్లం వెంకటరావు పై 11785 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
= = = = =
|
1, జనవరి 2014, బుధవారం
భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం (Bhadrachalam Assembly Constituency)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి