30, జనవరి 2014, గురువారం

మాకినేని బసవపున్నయ్య (Makineni Basavapunnaiah)

మాకినేని బసవపున్నయ్య
జననండిసెంబర్ 14, 1914
స్వస్థలంతూర్పుపాలెం (గుంటూరు జిల్లా)
పదవులురాజ్యసభ సభ్యుడు (1952-66)
మరణంఏప్రిల్ 12, 1992
మాకినేని బసవపున్నయ్య గుంటూరు జిల్లా తూర్పుపాలెంలో 1914 డిసెంబర్ 14న జన్మించారు. గుంటూరు ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో బి.ఎ అభ్యసించి, భారత జాతీయ కాంగ్రెస్ ద్వారా 1930లో స్వాతంత్ర్య పోరాటములో పాలు పంచుకొని, 1934లో కమ్యూనిస్ట్ పార్టీలో చేరారు. గుంటూరు జిల్లా పార్టీ ఆర్గనైజర్ గా 1934-40 కాలంలో పనిచేశారు. 1936లో జరిగిన విద్యార్ధి సంఘం సంస్థాపక మహాసభలో జాతీయ స్థాయి ఉప కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1940 వరకు ఆంధ్ర రాష్ట్ర విద్యార్ధి సంఘం కార్యదర్శిగా విద్యార్ధి ఉద్యమం నడిపారు. అదే సంవత్సరం గుంటూరు జిల్లా పార్టీ కార్యదర్శి బాధ్యత స్వీకరించారు. 1943లో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1948లో కలకత్తాలో జరిగిన సి.పి.ఐ ద్వితీయ మహాసభలో కేంద్ర కమిటీకి ఎన్నికయ్యారు. ఆ తరువాత 1950లో పొలిట్బ్యూరో కి ఎన్నికై 40 సంవత్సరాలు కొనసాగినారు.

మార్క్స్, లెనిన్ సిద్ధాంతాలకు కట్టుబడి జీవితాంతం పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడారు. పుచ్చలపల్లి సుందరయ్య లాంటి నాయకులతో కలిసి తెలంగాణ సాయుధ పోరాటములో పాల్గొన్నారు. భారత దేశములో విప్లవ సాధనకు అనుసరించవలిసిన వ్యూహం గురించి కమ్యూనిస్ట్ పార్టీలో చర్చ మొదలు పెట్టారు. ఈ చర్చ చివరకు 1964లో సి.పి.ఐ (యం) ఆవిర్భావానికి దారి తీసింది. ఈ సందర్భములో బసవపున్నయ్య సోవియట్ కమ్యూనిస్ట్ నాయకులు స్టాలిన్, మాలటొవ్, సుస్లోవ్, మాలెంకోవ్ లతో చర్చలు జరిపారు. 1957లో జరిగిన ప్రపంచ కమ్యూనిస్ట్ పార్టీల మహాసభలలో మావోసేటుంగ్, లీషావ్ చీ, చౌ ఎన్ లై లతో చర్చలు జరిపారు. కమ్యూనిస్ట్ సిద్ధాంతము పట్ల నిబద్ధతతో బాటు ప్రగాఢమైన దేశభక్తి కలవారు. 1952 నుంచి 1966 వరకు రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు. సి.పి.ఐ (యం) అధికార పత్రిక పీపుల్స్ డెమోక్రసీ సంపాదకునిగా 14 సంవత్సరాలు పనిచేశారు. బసవపున్నయ్య 1992 ఏప్రిల్ 12న మరణించారు.

విభాగాలు: గుంటూరు జిల్లా సమరయోధులు, గుంటూరు జిల్లా రాజకీయ నాయకులు, 1914లో జన్మించినవారు, 1992లో మరణించినవారు, రాజ్యసభ సభ్యులు, 


 = = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
  • తెలుగు వికీపీడియా,
  • ఆంగ్ల వికీపీడియా,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక