సిద్ధిపేట అసెంబ్లీ నియోజకవర్గం కరీంనగర్ జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజవర్గంలో 3 మండలాలు కలవు. ఈ సెగ్మెంట్ మెదక్ లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. 1985 నుంచి కేసీఆర్ 5 వరస విజయాలు సాధించగా 2004 నుంచి టి.హరీష్ రావు 6 సార్లు వరసగా విజయం సాధించారు.
నియోజకవర్గ పరిధిలోని మండలాలు:
2009 నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఈ నియోజకవర్గం పరిధిలో 3 మండలాలు కలవు.
2004 ఎన్నికలు:
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున పార్టీ అధ్యక్షుడు కె.చంద్ర శేఖరరావు తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జిల్లా శ్రీనివాస్‌పై 44668 ఓట్ల మెజారిటీతో గెలుపొందినారు. కె.చంద్ర శేఖరరావుకు 74287 ఓట్లు రాగా, శ్రీనివాస్‌కు 29616 ఓట్లు లభించాయి. 2004 ఉపఎన్నికలు: 2004 శాసనసభ ఎన్నికలలో విజయం సాధించిన తెరాస అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు లోక్‌సభ ఎన్నికలలో కూడా విజయం సాధించడంతో రాజీనామా చేయుటవల్ల జరిగిన ఉపఎన్నికలలో ఇక్కడి నుంచి తెరాస తరఫున కె.చంద్రశేఖరరావు అల్లుడు హరీశ్ రావు పోటీచేసి సమీప తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన చెరుకు ముత్యంరెడ్డిపై 24827 ఓట్ల మెజారిటీతో గెలుపొందినారు. హరీశ్ రావుకు 64374 ఓట్లు రాగా, ముత్యంరెడ్డి 39547 ఓట్లు సాధించారు. 2008 ఉపఎన్నికలు: తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యుల మూకుమ్మడి రాజానామాలతో ఏర్పడిన ఖాళీ వల జరిగిన ఉప ఎన్నికలలో ఈ స్థానం నుంచి తెరాస తరఫున మళ్ళీ హరిశ్ రావు పోటీచేసి 58935 ఓట్ల మెజారిటీతో సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంజయ్యపై విజయం సాధించారు. హరీశ్ రావుకు 76270 ఓట్లు రాగా, అంజయ్యకు 17335 ఓట్లు లభించాయి. 2009 ఎన్నికలు:
2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి, తెరాస వ్యవస్థాపకుడు కెసిఆర్ మేనల్లుడైన టి.హరీష్ రావు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బి.అంజయ్యపై 64014 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో భాగంగా రాజీనామా చేయగా ఫిబ్రవరి 15, 2010న స్పీకర్ ఆమోదించారు.
2010 ఉప ఎన్నికలు:
2009లో విజయం సాధించిన హరీష్ రావు తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో రాజీనామా చేయడంతో జరిగిన జూలై 27, 2010న ఉప ఎన్నికలు జరిగాయి. తెరాస తరఫున మళ్ళీ హరీష్ రావు పోటీచేయగా, కాంగ్రెస్ నుంచి శ్రీనివాస్ గౌడ్, తెలుగుదేశం తరఫున బాబూమోహన్ పోటీచేశారు. తెరాస అభ్యర్థి హరీష్ రావు తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన టి.శ్రీనివాస్ గౌడ్‌పై 95 వేలకుపైగా మెజారిటీతో గెలుపొందినారు. హరీష్ రావుకు 108779 ఓట్లు రాగా, శ్రీనివాస్ గౌడ్‌కు 12921 ఓట్లు లభించాయి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బాబూమోహన్ 5258 ఓట్లు మాత్రమే సాధించారు. ఏ ఎన్నికలలో భాజపా తెరాసకు మద్దతు ప్రకటించింది. 2014 ఎన్నికలు: 2014 శాసనసభ ఎన్నికలలో ఇక్కడి నుంచి తెరాస తరఫున పోటీచేసిన తన్నీరు హరీష్ రావు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్రీనివాస్ గౌడ్‌పై 93368 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. కె.సి.ఆర్. నేతృత్వంలోని తెలంగాణ తొలి మంత్రివర్గంలో హరీష్ రావు స్థానం పొందారు. 2018 ఎన్నికలు: 2018 ఎన్నికలలో తెరాస తరఫున తన్నీరు హరీష్ రావు, భాజపా తరఫున నాయిని నరోత్తమ్ రెడ్డి, జనకూటమి తరఫున తెలంగాణ జనసమితి పార్టీకి చెందిన మరికంటి భవానీరెడ్డి చేశారు. తెరాసకు చెందిన టి.హరీష్ రావు తన సమీప ప్రత్యర్థి తెలంగాణ జనసమితి పార్టీకి చెందిన మరికంటి భవాని పై 118699 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు.
= = = = =
|
19, మార్చి 2014, బుధవారం
సిద్ధిపేట అసెంబ్లీ నియోజకవర్గం (Siddipet Assembly Constituency)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి