8, మే 2014, గురువారం

కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం (Kuppam Assembly Constituency)

కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం చిత్తూరు జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఇది చిత్తూరు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2009 నాటి పునర్విభజన ప్రకారం ఈ నియోజకవర్గ సంఖ్య 294. రాష్ట్ర విభజన తర్వాత నియోజకవర్గ సంఖ్య 175 గా మారింది. చంద్రబాబునాయుడు ఇక్కడి నుంచి వరసగా ఆరవసారి ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

నియోజకవర్గంలోని మండలాలు:
  • కుప్పం, 
  • శాంతిపురం, 
  • రామకుప్పం, 
  • గుడుపల్లె,
గెలుపొందిన అభ్యర్థులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1983 ఎన్.రంగస్వామి నాయుడు తెలుగుదేశం పార్టీ బి.ఆర్.దొరస్వామి నాయుడు కాంగ్రెస్ పార్టీ
1985 ఎన్.రంగస్వామి నాయుడు తెలుగుదేశం పార్టీ ఎస్.కృష్ణ కాంగ్రెస్ పార్టీ
1989 నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ బి.ఆర్.దొరస్వామి నాయుడు కాంగ్రెస్ పార్టీ
1994 నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఆర్.గోపీనాథ్ కాంగ్రెస్ పార్టీ
1999 నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ సుబ్రహ్మణ్యం రెడ్డి కాంగ్రెస్ పార్టీ
2004 నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ సుబ్రహ్మణ్యం రెడ్డి కాంగ్రెస్ పార్టీ
2009 నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ సుబ్రహ్మణ్యం రెడ్డి కాంగ్రెస్ పార్టీ
2014 నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ చంద్రమౌళి రెడ్డి వైకాపా
2019 నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ చంద్రమౌళి రెడ్డి వైకాపా

2004 ఎన్నికలు:
2004 శాసనసభ ఎన్నికలలో కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన సమీప ప్రత్యర్థి ఎం.సుబ్రమణ్యం రెడ్డిని 59588 ఓట్ల తేడాతో ఓడించారు. చంద్రబాబు నాయుడుకి 98123 ఓట్లు రాగా, సుబ్రమణ్యం రెడ్డికి 38535 ఓట్లు లభించాయి. త్రిముఖ పోటీ జరిగిన ఈ నియోజకవర్గంలో పోటీ చేసిన మరో అభ్యర్థి నాగన్న. ఇండిపెండెంట్ గా పోటీచేసిన ఇతడు డిపాజిట్ కోల్పోయారు.

చంద్రబాబు నాయుడు
2009 ఎన్నికలు:
2009 శాసనసభ ఎన్నికలలో కుప్పం నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు మళ్ళీ పోటీచేసి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, శాంతిపురం జడ్పీటీసి సభ్యుడు అయిన సుబ్రహ్మణ్యం రెడ్డిపై 46వేలకు పైగా మెజారిటీతో నెగ్గి ఈ నియోజకవర్గంలో 5వ వరస విజయం నమోదుచేశారు. చంద్రబాబు సమీప ప్రత్యర్థి సుబ్రహ్మణ్యం కావడం ఇది వరసగా మూడవసారి కావడం విశేషం.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తన సమీప ప్రత్యర్థి, వైకాపాకు చెందిన చంద్రమౌళి రెడ్డిపై 47121 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించి వరసగా ఆరోసారి ఇక్కడి నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

2019 ఎన్నికలు:
2019 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన నారా చంద్రబాబునాయుడు తన సమీప ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన కృష్ణ చంద్రమౌళి పై 30722 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.


విభాగాలు: చిత్తూరు జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, చిత్తూరు లోకసభ నియోజకవర్గం, కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక