నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం కర్నూలు జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఇది నంద్యాల లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2009 నాటి పునర్విభజన ప్రకారం ఈ నియోజకవర్గ సంఖ్య 258. రాష్ట్ర విభజన తర్వాత నియోజకవర్గ సంఖ్య 139 గా మారింది.
గెలుపొందిన అభ్యర్థులు
2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి వైకాపాకు చెందిన భూమానాగిరెడ్డీ తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పారీ అభ్యర్థి, సిటింగ్ ఎమ్మెల్యే (2009లో కాంగ్రెస్ తరఫున విజయం) శిల్పామోహన్ రెడ్డిపై 3825 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. 2017 ఉప ఎన్నికలు: భూమానాగిరెడ్డి మరణంతో జరిగిన ఉప ఎన్నికలలో తెదేపా అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి తన సమీప ప్రత్యర్థి వైకాపా అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డిపై 26వేలకుపైగా మెజారిటీతో గెలుపొందినారు. 2019 ఎన్నికలు: 2019 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి వైకాపాకు చెందిన శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి పై 34560 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
= = = = =
|
Tags: Nandyal constituency information in Telugu, Ap & TS constituencies in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి