దేవేంద్ర ఫడ్నావిస్ జూలై 22, 1970న మహారాష్ట్రలోని నాగ్పూర్‌లో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. న్యాయశాస్త్రం అభ్యసించిన ఫడ్నావీస్ తండ్రి వారసత్వంగా రాజకీయాలలో ప్రవేశించి అంచెలంచెలుగా ఎదుగుతూ కార్పోరేటరుగా, మేయరుగా, మహారాష్ట్ర భాజపా అధ్యక్షుడిగా పనిచేసి 2014 అక్టోబరు 31న మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి చేపట్టారు.
బాల్యం, విద్యాభ్యాసం: 1970లో నాగ్‌పూర్‌లో జన్మించిన ఫడ్నావిస్ స్వస్థలం విదర్భ ప్రాంతంలోని సావలీ తాలుకా. నాగ్పూర్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. ఈయన 17 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు తండ్రి మరణించారు. తండ్రి కూడా జనసంఘ్, భాజపాలలో పనిచేశారు. రాజకీయ ప్రస్థానం: చిన్న వయస్సులోనే ఆరెస్సెస్‌లో చేరిన ఫడ్నావీస్ భాజపా విద్యార్థి విభాగమైన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తులో చురుకుగా పనిచేశారు. తండ్రి గంగాధర్ ఫడ్నావీస్ భాజపా తరఫున ఎమ్మెల్సీగా పనిచేశారు. ఈయన చిన్న వయస్సులోనే ఉన్నప్పుడే తండ్రి మరణించడంతో తండ్రి వారసత్వంగా రాజకీయాలలో ప్రవేశించి మొదట నాగ్పూర్ నగరపాలక సంస్థ కార్పోరేటరుగా ఎన్నికయ్యారు. 1997లో 27 ఏళ్ళ వయస్సులోనే నాగ్పూర్ కార్పోరేషన్ మేయరుగా పదవి చేపట్టి దేశంలోనే అతి చిన్న వయస్సులో మేయర్ పదవి పొందిన అతికొద్ది మంది జాబితాలో చేరారు. 1999లో తొలిసారిగా మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికై ఇప్పటివరకు 4 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. 2001లో భాజపా యువమోర్చా జాతీయ ఉపాధ్యక్షుడిగా, 2010లో మహారాష్ట్ర భాజపా ప్రధాన కార్యదర్శిగా, 2013లో మహారాష్ట్ర భాజపా అధ్యక్షుడిగా పదవులు పొందారు. 2014 అక్టోబరు 31న మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి మహారాష్ట్ర తొలి భాజపా ముఖ్యమంత్రిగా అవతరించారు.
= = = = =
|
31, అక్టోబర్ 2014, శుక్రవారం
దేవేంద్ర ఫడ్నావిస్ (Devendra Fadnavis)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి