2, నవంబర్ 2014, ఆదివారం

కేశూభాయి పటేల్ (Keshubhai Patel)

 కేశూభాయి పటేల్
జననంజూలై 24, 1928
రాష్ట్రంగుజరాత్‌
రంగంరాజకీయాలు
పదవులుగుజరాత్ ముఖ్యమంత్రి (1995, 1998-2005)
1928 జూలై 24 న జునాగర్ జిల్లా విశ్వదర్‌లో జన్మించిన కేశూభాయి పటేల్ గుజరాత్‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు. భారతీయ జనతా పార్టీకి చెందిన కేశూభాయ్ గుజరాత్ రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు.

రాజకీయ ప్రస్థానం:
ప్రారంభం నుంచే ఆరెస్సెస్ ప్రభావం కలిగిన కేశూభాయ్ పటేల్ 1960లో జనసంఘ్ పార్టీ ద్వారా కార్యకర్తగా రాజకీయాలలో ప్రవేశించారు. 1977లో రాజ్‌కోట్ నుంచి లోకసభకు ఎన్నికైనారు. 1978-80 కాలంలో జనతామోర్చాలో చేరి గుజరాత్ రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 1980లో భాజపా ఏర్పాటుతో ఆ పార్టీలో ప్రవేశించి గుజరాత్‌లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించి 1995లో భాజపా ప్రభుత్వం ఏర్పడటానికి కారకులైనారు. సహజంగానే 1995లో ఆయన ముఖ్యమంత్రి పదవి పొందారు. కొంతకాలం తర్వాత ఆయన సహచరుడు శంకర్‌సింఘ్ వాఘేలా తిరుగుబాటుతో ముఖ్యమంత్రి పదవి కోల్పోయారు. 1998లో మళ్ళీ భాజపా ప్రభుత్వం ఏర్పడటంతో ఆయనే రెండోపర్యాయం ముఖ్యమంత్రి పదవి పొందారు. 2001లో గుజరాత్ ఉపఎన్నికలలో భాజపాకు ఆశించినంత విజయం లభించకపోవుటచే, ముఖ్యమంత్రి పీఠం నుంచి వైదొలగాలని ఇతనిపై ఒత్తిడి రావడంతో కేశూభాయి పదవి నుంచి తప్పుకొన్నారు. ఆ తర్వాత నరేంద్ర మోడి పగ్గాలు స్వీకరించారు.

విభాగాలు: గుజరాత్ ముఖ్యమంత్రులు, భారతీయ జనతాపార్టీ రాజకీయ నాయకులు, 1928లో జన్మించినవారు, 


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక